YS Jagan Mohan Reddy : విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం.. ‘జగనన్న విద్యాకానుక’లో జగన్ స్పీచ్!
NQ Staff - June 12, 2023 / 01:57 PM IST

YS Jagan Mohan Reddy : నాలుగవ విడత ”జగనన్న విద్యాకానుక” కిట్ల పంపిణీ కార్యక్రమం తాజాగా పల్నాడు జిల్లాలోని క్రోసూరు లో ఏపీ సీఎం వైఎస్ జగన్ స్టార్ట్ చేసారు.. ఈ వేడుకలో జగన్ స్పీచ్ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ఈ నాలుగేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన తెలిపారు..
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. పాఠశాలలు ప్రారంభం అయ్యే రోజునే విద్యాకానుక అందిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత పెదకూరపాడు నియోజక వర్గంలో రూ. 217 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులను జగన్ ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేసారు. ఇక ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో కూడా ముచ్చటించి క్లాస్ రూమ్స్ ను పర్యవేక్షించారు. ఇదే కార్యక్రమంలో జగన మరోసారి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

YS Jagan Mohan Reddy Jagananna Vidya Kanuka Program Held In Palnadu
ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, పవన్ జనసేన పార్టీల పైనే విమర్శలు సంధించే జగన్ ఈసారి కాస్త రూటు మార్చినట్టు కనిపిస్తుంది.. ఈసారి బీజేపీ పై జగన్ మాటల తూటాలను పేల్చాడు. బీజీపీ తనకు అండగా ఉండక పోవచ్చు అని.. అయినా తాను వాళ్ళను నమ్ముకోలేదని ఆయన తెలిపారు.. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలు మాత్రమే తనకు సైన్యం అని మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది చూసి మాత్రమే ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు..