YS Jagan Mohan Reddy : గడప గడపకీ వైసీపీ : 27 మంది ఎమ్మెల్యేలకి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.!

NQ Staff - September 28, 2022 / 09:45 PM IST

YS Jagan Mohan Reddy  : గడప గడపకీ వైసీపీ : 27 మంది ఎమ్మెల్యేలకి వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.!

YS Jagan Mohan Reddy  : ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ పేరుతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళుతోన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో మరోసారి బంపర్ విక్టరీ కొట్టాలంటే, ఇప్పుడు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు బలంగా చెప్పుకోవాలన్నది వైసీపీ అధినేత, ఆంద్ర పద్రశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆలోచన, వుద్దేశ్యం.

అయితే, గడప గడపకీ వెళుతోన్న వైసీపీ ప్రజా ప్రతినిధులకి జనం నుంచి చాలా చోట్ల ఛీవాట్లు ఎదురవు తున్నాయ్. చెప్పుకోలేని అవమానాలు కూడా జరుగుతున్నాయ్. మూడేళ్లో ఏం చేశారు.? అంటూ మంత్రుల్నీ, ఎమ్మెల్యేలనీ, ఎంపీలనీ ప్రజలు ముఖా ముఖి నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అత్యంత నీచంగా చీపుళ్లతో తరిమేస్తున్నారు కూడా.

పరిస్థితి మెరుగుపడిందన్న జగన్..

అయితే, గతంతో పోల్చితే, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా జనంలోకి వెళుతున్నారనీ, వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలూ, మంత్రులతో, ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై తాజాగా వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు మెరుగు పరుచుకున్న ఎమ్మెల్యేలకు అభినందనలు తెలియ చేశారు.

పనితీరు మెరుగు పరుచుకోని వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 27 మంది అలా క్లాసులు పీకించుకున్నారనీ సమాచారం. 27 మంది కాదు, 27 శాతం మంది అని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేస్తామని ధీమాతో వుంది వైసీపీ.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us