Modi : డబ్బులు ప్రింట్ చేసి, బటన్ నొక్కడమేనా.?

NQ Staff - July 27, 2022 / 11:02 PM IST

Modi : డబ్బులు ప్రింట్ చేసి, బటన్ నొక్కడమేనా.?

Modi : సామాన్యులకి అర్థమయ్యే భాషలో చెప్పేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలా అన్నారా.? లేదంటే, అవగాహనా రాహిత్యంతో అలాంటి వ్యాఖ్యలు చేశారా.?

YS Jagan Mohan Reddy comments on Modi about help

YS Jagan Mohan Reddy comments on Modi about help

గోదావరి నది ఉగ్రరూపం నేపథ్యంలో సంభవించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు, బాధితుల వెతల్ని తెలుసుకుంటున్నారు, ఓదార్చుతున్నారు.. తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే వుంది.!

ప్రింట్ చేసుకుంటే డబ్బలొచ్చేస్తాయా.?

కరెన్సీ, ప్రింటింగ్ మెషీన్లలోనే తయారవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దానికో పెద్ద కథ వుంటుంది. ఎలాగంటే అలా కరెన్సీ నోట్లను ప్రింట్ చేసుకోలేం. ‘డబ్బుల్ని ప్రింట్ చేసేది వాళ్ళే.. వాళ్ళ దగ్గర డబ్బుల్లేవంటే ఎలా నమ్మేది.?’ అంటూ కేంద్రంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

‘మీరే బటన్ నొక్కి పునరావాసానికి సంబంధించిన నిధుల్ని లబ్దిదారుల ఖాతాల్లోకి పంపించండి..’ అని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి.. వరద ముంపు బాధితుల సాక్షిగా సలహా ఇచ్చేశారు.

నిజానికి, ఎలాక్కావాలంటే అలా కరెన్సీ నోట్లను ప్రింట్ చేసెయ్యడం కుదరదు. అదే సమయంలో, బటన్ నొక్కడం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, దేశ ప్రధానికీ రాక కాదు.! వాటికి కొన్ని లెక్కలు, వ్యవహారాలు వుంటాయ్.!

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us