YS Jagan : ఫ్లాష్.. ఫ్లాష్.. : భర్తతోపాటు జగన్ ని కలిసిన సోదరి

YS Jagan : సీఎం వైఎస్ జగన్ సోదరి అంటే వైఎస్ షర్మిల కాదు. ఆయన చిన్నాన్న (సుధీర్ రెడ్డి) కూతురు విరానిక. విరానిక.. సినిమా హీరో మంచు విష్ణు భార్య. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కోడలు. విష్ణు, విరానిక ఈరోజు (శుక్రవారం) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. జగన్, ఆయన సతీమణి భారతి.. విష్ణు దంపతులకు సాదరంగా ఆహ్వానం పలికారు. రెండు ఫ్యామిలీలూ కలిసి లంచ్ చేశాయి.

ఏదో ఉంది..

మోహన్ బాబు కుటుంబంలో మొత్తానికి ఏదో పెద్ద ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన పెద్ద కొడుకు విష్ణు ఈమధ్య కాలంలో వరసపెట్టి చిరంజీవి తదితర వీఐపీలందర్నీ కలుస్తున్నారు. ఎందుకు? ఏమిటీ? అని అడిగే త్వరలోనే చెబుతామంటున్నారు. అయితే బంధుత్వం కారణంగా వీళ్లు జగన్ కుటుంబాన్ని రెగ్యులర్ గా కలుస్తుంటారు. మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగా: YS Jagan

‘జగన్ ని కలిసిన సోదరి’ అనే హెడ్డింగ్ చూడగానే వెంటనే వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ తో భేటీ అయ్యారని అనుకోవటంలో తప్పులేదు. పైగా వీళ్లద్దరికీ పడట్లేదనే ప్రచారం నేపథ్యంలో ఇలాంటి సమావేశం జరిగిందంటే అంతకు మించిన ఆసక్తికరమైన వార్త ఏముంటుంది. జగన్ తనను రాజకీయంగా ఎదగనీయట్లేదనే కోపంతో షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ రాసిన స్టోరీని ఆమె తీవ్రంగా ఖండించారు కూడా.

YS Jagan : jagan-sister-met-him
YS Jagan : jagan-sister-met-him

అంతా తూచ్..

అసలే ముఖ్యమంత్రి జగన్ అంటే ఏమాత్రం సహించని పచ్చ బ్యాచ్ ఆయన కుటుంబ సభ్యుల మధ్య పుల్లలు పెట్టడానికి ఇటీవల తెగ ప్రయత్నిస్తోంది. మొన్న క్రిస్మస్ సందర్భంగా షర్మిల ఇడుపులపాయకు రాకపోవటాన్ని ఎల్లో మీడియా భూతద్దంలో పెట్టి చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ మధ్య విభేదాలేమీ లేవని చెప్పటానికే షర్మిల జగన్ ని కలిశారని ఈ హెడ్డింగ్ చూసి అనుకోవచ్చు. కానీ అలాంటిదేమీ లేదు. జగన్ ని కలిసింది ఆయన సిస్టరే కానీ ఓన్ కాదు. కజిన్.

Advertisement