YS Jagan : ప్రాజెక్టులకు ప్రాణం పోస్తున్న జగన్.. మళ్లీ రతనాల సీమగా మారనున్న రాయలసీమ…..

NQ Staff - November 30, 2023 / 06:30 PM IST

YS Jagan : ప్రాజెక్టులకు ప్రాణం పోస్తున్న జగన్.. మళ్లీ రతనాల సీమగా మారనున్న రాయలసీమ…..

YS Jagan :

అన్నదాత బాధలు బాపేలా జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని మరోసారి నిరూపితమైంది. సాగు నీరు, తాగు నీరు అందించే భగీరథ ప్రయత్నానికి పూనుకున్న వైసీపీ సర్కారు ఆశయం నెరవేరింది. గతంలో చేతకాని పాలకులు వల్లకాదని వదిలేసిన ప్రాజెక్టులు ఇప్పుడు సీఎం వైయస్ జగన్ పాలనలో పూర్తయి రాయలసీమ మళ్ళీ రతనాల సీమగా మారుతోంది.

గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ పనులు అసాధ్యమని చేతులెత్తేశాడు అప్పటి సీఎం చంద్రబాబు. కానీ నేడు ముఖ్యమంత్రి జగన్‌ దాన్ని సుసాధ్యం చేసి గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.

అవుకు సొరంగాల పనులకు వైయస్ఆర్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి చాలాభాగం పూర్తి చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే ఖర్చుచేసి ఫాల్ట్‌ జోన్‌లో పనులు వదిలేసింది. కానీ సీఎం జగన్‌ రూ.145.86 కోట్లు ఖర్చుతో టన్నెల్‌ 2 పనులను పూర్తి చేశారు. టన్నెల్‌ 3 పనుల కోసం ఇప్పటికే మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు చివరిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవు వరకు పనులు పూర్తయ్యాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించవచ్చు.

శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించేలా 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు వైయస్ఆర్. ఓర్వకల్లు రిజర్వాయర్‌ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్‌ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైయస్ఆర్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి.

అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్‌ జోన్‌లో పనులు మాత్రమే మిగిలాయి. కానీ ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయలేకపోయింది టీడీపీ సర్కార్‌. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్‌ జోన్‌ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్‌ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్‌ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. కానీ సీఎం వైయస్ జగన్‌ అధికారంలోకి రాగానే ఫాల్ట్‌ జోన్‌లో పనులు పూర్తయ్యాయి.

 YS Jagan Inspected Owk Tunnel 2 And Unvelling Pylon

YS Jagan Inspected Owk Tunnel 2 And Unvelling Pylon

చంద్రబాబు 1996లో లోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేసినా, ఆ తరువాత దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు కూడా దీన్ని పట్టించోకోలేదు.

మళ్ళీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశాడు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్‌ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు జగనన్న పాలనలో ఆ పనులు పూర్తి అయి రైతులకు మేలు జరగనుంది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us