YS Jagan : షాకింగ్ షేకింగ్ న్యూస్ : ఇది జరిగితే జగన్ సీ‌ఎం సీట్ కి గండి పడ్డం గ్యారెంటీ?

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీని ఢీకొట్టే పార్టీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఏపీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ఇంకా మూడేళ్లకుపైగా సమయం ఉంది. అప్పుడైనా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వైఎస్సార్సీపీతో నువ్వానేనా అన్నట్లు తలపడాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు వయసు సహకరించే సూచనలు కనిపించట్లేదు. ఆయన కొడుకు నారా లోకేష్ కి ఒంటరిగా పార్టీని నడిపేంత అనుభవం, సత్తా లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ బీజేపీ పంచన చేరితే తప్ప జగన్ ని కదిలించలేడని పరిశీలకులు చెబుతున్నారు.

ఎప్పుడూ..

చంద్రబాబు సింగిల్ గా ఎప్పుడూ పవర్ లోకి రాలేదు. చరిత్ర చదివితే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. 1999లో బీజేపీతో జట్టు కట్టడం వల్లే గెలవగలిగాడు. ఆ తర్వాత 2014లోనూ కమల దళంతో కలిసి నడవబట్టే నెగ్గాడు. మధ్యలో 2009లో కేసీఆర్, కమ్యూనిస్టులతో మహాకూటమి కట్టినా ఓటమి తప్పలేదు. 2019లో బీజేపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేసి జగన్ కి బంగారంలాగా అధికారాన్ని అప్పగించారు.

యూటర్న్: YS Jagan

జగన్ చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబుకు తన భవిష్యత్తేంటో అర్థమైపోయింది. మళ్లీ బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నా వాళ్లు కనీసం దగ్గరికి కూడా రానీయట్లేదు. మొన్నటిదాకా హస్తం పార్టీతో చట్టాపట్టాలేసుకొని తిరిగిన బాబును కాషాయం పార్టీవాళ్లకు నమ్మబుద్ధికావట్లేదు. పైగా జగన్ తో బీజేపీకి ఎలాంటి ఇబ్బందీ లేదు. రాష్ట్రంలో కమలంపార్టీ కేడర్ కాస్త హడావుడి చేసినా అది ఉనికిని చాటుకోవటానికే అన్నట్లుగా ఉంది.

YS Jagan : if it is possible, problems for jagan
YS Jagan : if it is possible, problems for jagan

మరోసారి..

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ.. బీజేపీ.. జనసేన.. ఈ మూడు పార్టీల పరిస్థితీ ఒకేలా ఉంది. బీజేపీ, జనసేన కలిసినా వైఎస్సార్సీపీని ఓడించేంత సీన్ లేదు. టీడీపీ, జనసేన కలిసినా కష్టమే. కాబట్టి చంద్రబాబు మరోసారి ఏపీలో చక్రం తిప్పాలన్నా, జగన్ ముఖ్యమంత్రి సీటుకి గండి కొట్టాలన్నా మిగతా రెండు పార్టీలనూ కలుపుకుపోక తప్పదు. జనసేన ఉన్నా లేకపోయినా టీడీపీ-బీజేపీ మాత్రం ఏకతాటిపైకి రాకపోతే ప్రజలు మరోసారి జగన్ కి జై కొట్టేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement