YS Jagan : వాళ్లు చేసిన వెధవ పనికి తలపట్టుకొని కూర్చున్న జగన్?

YS Jagan : ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దండుకునే ముఠాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు కూడా ఇలాగే అందినకాడికి దోచుకున్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ సర్కారులోనూ కొందరు అత్యాశపరులు ఇలాగే రైతు భరోసా సొమ్ములను తమ జేబుల్లో నింపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వాళ్లు చేస్తున్న వెధవ పనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘ఏమీ సేతుర లింగా’ అంటూ తలపట్టుకొని కూర్చున్నారని టాక్.

ఏటా..

వైఎస్ జగన్ సీఎం అయ్యాక తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రైతు భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీని కింద ప్రతి రైతు కుటుంబానికీ ఏటా 13,500 రూపాయలను వాళ్ల అకౌంట్లలో వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అధికార పార్టీ దళారులు ఆ డబ్బుల మీద కన్నేశారు. ఇతరుల పాసు బుక్కులను తమ వద్ద ఉంచుకొని పర్సంటేజీలు, వాటాలు, మామూళ్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తప్పకుండా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏ జిల్లాల్లో?: YS Jagan

ఎక్కువగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రైతు భరోసా పథకం పక్కదారి పడుతోందనే ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి వస్తున్నాయి. ఈ వార్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరికి కూడా చేరాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రజలను ఆకట్టుకునేందుకు ముందుచేతే ఈ నిధులను విడుదల చేస్తున్నా మధ్యవర్తులు అనవసర జోక్యంతో అడ్డుకుంటూ ఉండటం పట్ల ఆయన మండిపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మరింత సీరియస్ గా ఫోకస్ పెట్టాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారట.

YS Jagan : headache for cm jagan with those peoples fraud
YS Jagan : headache for cm jagan with those peoples fraud

ఇది చాలదా?..

అసలే లోకల్ బాడీ ఎలక్షన్ల విషయంలో జగన్ పార్టీ అనుకున్నది అనుకున్నట్లు జరగటంలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పరోక్షంగా ఒక ప్రతిపక్షంలాగే వ్యవహరిస్తున్నాడని వైఎస్సార్సీపీ భావిస్తోంది. అందుకే అడుగడుగునా జాగ్రత్తలు పాటిస్తోంది. అయినప్పటికీ కొంత మంది ఆలోచనా రహితంగా చేస్తున్న ఈ చిల్లర ఛేష్టలతో, పనికి మాలిన పాలిటిక్స్ తో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపించట్లేదనే వాదన వినిపిస్తోంది.

Advertisement