YS Jagan : ఇప్పుడే అందిన వార్త : ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

YS Jagan : ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (శనివారం) రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ కర్మాగారంలోని ప్రభుత్వ పెట్టుబడిని వంద శాతం విత్ డ్రా చేసుకోవాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విమర్శలకు చెక్ పెట్టారు.

‘తెలుగు’ గుండె చప్పుడు..

ఏపీ జనమంతా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు ప్రజల తిరుగులేని పట్టుదలకు, దృఢ సంకల్పానికి సజీవ సాక్ష్యంగా, గుండె చప్పుడుగా నిలుస్తున్న ఈ సంస్థను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రైవేట్ కి ధారాదత్తం చేయటానికి దర్జాగా పూనుకుంది. దీంతో ఆంధ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమ బాట పడుతున్నాయి.

కొనసాగించండి: YS Jagan

తెలుగు ప్రజలు ప్రాణాలకు తెగించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎప్పటి మాదిరిగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలానే కొనసాగించాలని, పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని సీఎం జగన్.. పీఎం మోడీని రిక్వెస్ట్ చేశారు. ప్రత్యక్షంగా వేల సంఖ్యలో, పరోక్షంగా లక్షల మందికి పొట్ట నింపుతున్న గొప్ప చరిత్ర కలిగిన ఈ కంపెనీని పుట్టి ముంచొద్దని అభ్యర్థించారు.

YS Jagan : ap cm jagan letter to pm modi
YS Jagan : ap cm jagan letter to pm modi

ఎన్నో రంగాలు..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) మన దేశంలోనే తొలి తీర ప్రాంత ఆధారిత సమీకృత ఉక్కు కర్మాగారమని, ఈ సంస్థ ఉత్పత్తి చేసే లాంగ్ స్టీల్ ప్రొడక్టులను నిర్మాణ, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆటోమొబైల్ తదితర రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారని వైఎస్ జగన్ నరేంద్ర మోడీకి గుర్తుచేశారు. ఏపీకి ఐకాన్ గా నిలిచిన విశాఖ ఉక్కును నష్టాల నుంచి గట్టెక్కించి ఆంధ్రులకు శాశ్వత హక్కుగా నిలపాలని విన్నవించారు.

Advertisement