YS Jagan : ప్రధాని మోడీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ‘వికేంద్రీకరణ’ ప్రస్తావన తెస్తారా.?

NQ Staff - November 10, 2022 / 10:09 PM IST

YS Jagan : ప్రధాని మోడీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ‘వికేంద్రీకరణ’ ప్రస్తావన తెస్తారా.?

YS Jagan : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్న సంగతి తెలిసిందే. పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు.

కాగా, ప్రధాని మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు కనీ వినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయి. అదే సమయంలో, వైసీపీ తరఫున కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వికేంద్రీకరణ ప్రస్తావన వస్తుందా.?

కాగా, విశాఖను పరిపాలనా రాజదానిగా చెయ్యాలన్న ఆలోచనతో వున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ విషయాన్ని ప్రధాని సాక్షిగా ప్రస్తావిస్తుందా.? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇందుకోసం తనదైన వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారా.? అన్న విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రధానిగా నరేంద్ర మోడీ, చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఆ అమరావతిని వైసీపీకి చెందిన పలువురు మంత్రులు స్మశానంగా, ఎడారిగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి సైతం అమరావతిపై ఆరోపణలు చేస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో విశాఖ విషయమై వికేంద్రీకరణ ప్రస్తావనను వైఎస్ జగన్ తీసుకొస్తే, దానిపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us