Yellow Media : లేనిది ఉన్నట్టు రాస్తున్న ఎల్లో మీడియా.. ఇంత దారుణమా..!

NQ Staff - November 29, 2023 / 08:28 PM IST

Yellow Media : లేనిది ఉన్నట్టు రాస్తున్న ఎల్లో మీడియా.. ఇంత దారుణమా..!

Yellow Media :

పచ్చ కామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు ఉంది టీడీపీ, ఎల్లో మీడియా పరిస్థితి. జగన్ ఏం చేసినా సరే అందులో తప్పులు లెక్కపెట్టడం లాంటి పనులే చేస్తోంది టీడీపీ పార్టీ. ఇక ఎల్లో మీడియా ఏమైనా తక్కువనా.. గుడ్డు మీద ఈకలు పీకినట్టే ప్రవర్తిస్తోంది. ఎప్పుడూ జగన్ పరువును తీయాలా అని చూస్తూ ఉంటుంది. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని జగన్ ఆరాటపడుతున్నారు. కానీ జగన్ చేసే ప్రతి పనిలో కూడా తప్పులు లెక్కపెట్టాలని ఆరాట పడుతోంది టీడీపీ పార్టీ.

ఇప్పుడు తాజాగా ఈనాడు పత్రిక అయితే జగన్ మీద బురద జల్లే పనిని నెత్తిన పెట్టుకుంది. కేంద్రం నుండి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చే ఐఏఎస్ అధికారులు అత్యధికులు సిఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారేనని టిడిపి నేత అచ్చెన్నాయుడు చేత చెప్పించడం.. దాన్ని ఈనాడు పత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో రాపించడం చకచకా జరిగిపోయాయి. అసలు ఆ పత్రికకు ఎంత సేపు జగన్ చేసే పనిలో అన్నీ తప్పుల్లాగే కనిపిస్తాయి. అంతే తప్ప టీడీపీ పార్టీ గతంలో చేసిన అరాచకాలపై ఎన్నడూ ఆ మీడియా మాట్లాడదు. గురువింద గింజ తన నలుపు ఎరగదు అన్నట్టే ఈనాడు పత్రిక ఎన్నడూ టీడీపీ గురించి మాట్లాడదు.

టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారుల గురించి ఈనాడులో ఎందుకు రాయలేదు. ఇదే విషయంపై ఆనాడు ఈ మీడియా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు జగన్ నిజాయితీగా ఉండే అధికారారులు రాష్ట్రానికి కావాలని అనుకుంటే మాత్రం వారికి కులాన్ని అంటగడుతోంది. గతంలో చంద్రాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి, వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఏపీ క్యాడర్ కు వచ్చారు. వీరు మాత్రమే కాకుండా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఎంతో మంది ఏపీకి తెచ్చుకున్నారు.

వారితో తన ఇష్టాను సారం అక్రమ వ్యాపారాలు నడిపించుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు మనం పైన పేర్కొన్న పేర్లు కొన్ని మాత్రమే. కానీ ఇంకా లెక్కకు మించిన అధికారులను ఎంతో మందిని చంద్రబాబు కేంద్రం నుంచి తెప్పించుకుని అరాచక పాలన సాగించాడు. కానీ అవేమీ రాయని ఈనాడు.. నేడు మాత్రం జగన్ ను బద్నాం చేయాలని చూస్తోంది.

లేనిది ఉన్నట్లు గా చూపించి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది ఈనాడు. జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి తటట్ఉకోలేక.. రేపు ఎన్నికల్లో ఓడిపోతామని భయం పట్టుకున్న టీడీపీ.. ఇలా ఎల్లో మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తోంది. జర్నలిజం విలువలను మర్చిన ఈనాడు పత్రిక.. ఇలా విషాన్ని చిమ్మి ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. కాబ్టటి ఆ మీడియారాసే ప్రజా వ్యతిరేక వార్తలను నమ్మొద్దని చెబుతున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us