జగన్ కి హ్యాండ్ ఇచ్చి ఆయన గనక పార్టీకి రాజీనామా చేస్తే .. ఆ జిల్లాలో వైసీపీ అట్టర్ ప్లాప్ ?

Admin - November 6, 2020 / 12:53 PM IST

జగన్ కి హ్యాండ్ ఇచ్చి ఆయన గనక పార్టీకి రాజీనామా చేస్తే .. ఆ జిల్లాలో వైసీపీ అట్టర్ ప్లాప్ ?

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎప్పటికి మాటల యుద్ధం జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటె అధికార పార్టీలో వర్గపోరు ఉండడంతో నాయకుల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి. ఇక ఇప్పటికి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైసీపీ లో వర్గ పోరు గట్టిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో మరో చోట కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. వర్గపోరు కారణంగా వైసీపీ నుండి బయటకు వెళ్ళడానికి సిద్దమయ్యాడట. ఒకవేళ ఆ నాయకుడు మాత్రం వైసీపీ కి దూరం అయితే ఆ జిల్లాలో జగన్ కు గట్టి దెబ్బ తగలడం ఖాయమని చెప్పాలి. మరి అంతటి గొప్ప వైసీపీ నాయకుడు ఎవరా అని ఇప్పటికే అందరికి సందేహం కలగొచ్చు. ఇక ఆయన ఎవరో కాదు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌.

YS Jagan can arrest Chandrababu Naidu becauses of this reason

YS Jagan can arrest Chandrababu Naidu becauses of this reason

అయితే గతంలో వరప్రసాద్ లోక్ సభ ఎంపీ గా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఈ సారికి ఆయనకు ఎంపీ టికెట్ రాకపోవడంతో గూడూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకొని గెలుపొందారు. అయితే వరప్రసాద్ గొప్ప విద్యావంతుడు కావడంతో మంచి మాటకారిగా గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదు ఆయనకు జనసేన నుండి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది. అయితే వరప్రసాద్ వైసీపీ కు రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే వైసీపీ పార్టీలోనే ఇలా పుకార్లు సృష్టిస్తున్నారట.

ఇక ఒకవైపు ఇలా వస్తున్న వార్తలకు వరప్రసాద్ స్పందిస్తూ.. ‘నేను ఎందుకు పార్టీ మారుతా.. పార్టీ మారె ప్రసక్తే లేదు’ అని చెప్పుకొచ్చాడు. కానీ లోలోపల పార్టీ మారే చర్చ జోరుగా జరుగుతుందట. ముఖ్యంగా ఆయనను వైసీపీ నుండి బయటకు పంపాలని ఆ పార్టీలోని నాయకులే ప్లాన్ వేస్తున్నారట. ఒకవేళ వరప్రసాద్ పార్టీని వీడితే జగన్ కు కోలుకోలేని దెబ్బె అని అంటున్నారు. వాస్తవానికి నెల్లూరు జిల్లాలో వరప్రసాద్ కు మంచి పట్టు ఉంది. ఇక ఆయన పార్టీ మారితే ఆ జిల్లాలో వైసీపీ అట్టర్ ప్లాఫ్ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us