YCP leaders : త్వరలో, అతి త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ.!
NQ Staff - July 24, 2022 / 06:55 PM IST

YCP leaders : విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందనీ, చంద్రబాబు కాదు కదా, ఇంకెవరు అడ్డొచ్చినా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆపలేరనీ పదే పదే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇంతకీ, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.?

YCP leaders say that Visakhapatnam Executive Capital
న్యాయస్థానాల్లో కేసులున్నంత మాత్రాన, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆగిపోదు. ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి వుండాలి. అదే అసలు సమస్య. మూడు రాజధానులంటూ ప్రకటించేస్తే సరిపోదు. సరైన అధ్యయనం లేకుండా, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ప్రకటించేయడం వల్లే ఈ దుస్థితి.
మూడు రాజధానులకు అడ్డంకి ఎవరు.?

YCP leaders say that Visakhapatnam Executive Capital
అసమగ్రమైన బిల్లు పెట్టేసి, వైసీపీ సర్కారు నాలిక కరచుకుంది. ఆ విషయాన్ని వైసీపీనే స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకుని, బిల్లుని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వుండగా, దాన్ని కాదని.. ఏవేవో ప్రయత్నాలు చేసి వైసీపీ సర్కారు చేతులు కాల్చుకుంది.
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో ప్రభుత్వానికి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాల్ని గౌరవించకుండా, ఏ చట్టాలు తెరపైకొచ్చినా.. అవి వృధా అన్నది న్యాయ నిపుణుల వాదన. ఈ పరిస్థితుల్లో ‘విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుంది..’ అని వైసీపీ కుండబద్దలుగొట్టేయడం వల్ల ఏంటి ప్రయోజనం.?
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకపోవడానికి, వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడమే అసలు కారణం.