అదేంటి పక్కా గెలుస్తాడు అనుకున్న జగన్ .. నెమ్మదిగా ఊపు తగ్గించాడు ? 

తిరుపతి పార్లమెంట్‌ స్థానంకు రాబోతున్న ఉప ఎన్నిక అధికార పార్టీ వైకాపాకు మరియు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. సిట్టింగ్‌ స్థానంను గెలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా వైకాపా నాయకులు చెబుతున్నారు. ఈ స్థానంను మొదట బల్లి దుర్గా ప్రసాద్‌ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల దుర్గా ప్రసాద్‌ కుటుంబానికి కాకుండా తనకు ఆప్తుడిగా పేరున్న డాక్టర్‌ గురుమూర్తికి ఇవ్వాలని జగన్‌ నిర్ణయించుకున్నాడు. గురు మూర్తికి సీటు అనుకున్న వెంటనే ఆయన ప్రచారం మొదలు పెట్టాడు. రెండు వారాల పాటు తీవ్రంగా ప్రచారంతో హోరెత్తించడంతో పాటు పార్టీ కార్యకర్తలను మరియు నాయకులను కలిసి మద్దతు తెలపాల్సిందిగా కోరాడు.
ycp and jagan becoming weak in tirupathi by elections
ycp and jagan becoming weak in tirupathi by elections
ఉప ఎన్నికల్లో చాలా ఈజీగా వైకాపా గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో రెండు లక్షలకు పై చిలకు ఓట్ల మెజార్టీ వైకాపాకు వచ్చింది. కనుక గెలుపు విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. మెజార్టీ నిలుపుకోవాలని వైకాపా భావిస్తున్నట్లుగా అనిపించింది. కాని గత కొన్ని రోజులుగా జగన్‌ నుండి తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. సీఎం జగన్‌ ఆ స్థానంపై ప్రత్యేక శ్రద పెడితేనే ఫలితం పాజిటివ్‌ గా వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు చక చక పావులు కదుపుతూ ఇప్పటికే అక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు తమ భవితవ్యంను పరీక్షించుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో వారు వైకాపాను నెగ్గించలేక పోతే ఖచ్చితంగా పార్టీలో వారికి ప్రాముఖ్యత తగ్గుతుందని అంటున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్‌ కూడా పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ పార్టీ విజయంకు పని చేయాల్సిందిగా ఉత్సాహ పర్చాల్సి ఉంది. కాని జగన్‌ మాత్రం గెలుస్తుందనే ధీమానో లేదా మరేంటో కాని ఊపు తగ్గించినట్లుగా అనిపిస్తుంది. తనకు ఆప్తుడు అయిన డాక్టర్‌ దుర్గా ప్రసాద్‌ విజయం కోసం జగన్‌ ఏమేరకు ప్రయత్నిస్తాడు అనేది చూడాలి. వైకాపా అభ్యర్థి విషయంలో ఇంకా కొందరిలో అనుమానాలు ఉన్నాయి. ఒక వేళ చివరి నిమిషంలో జగన్‌ అభ్యర్థిని మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.
Advertisement