Yamini Sadineni: ఫైర్ బ్రాండ్ యామిని సాధినేని వైఎస్ఆర్‌సీపీ గ‌డ‌ప తొక్క‌నుందా ?

Yamini Sadineni: ఫైర్ బ్రాండ్, స్పోక్స్ ప‌ర్స‌న్‌, టీవీ ప్యాన‌లిస్ట్ యామ‌ని సాధినేని తెలుగు ప్ర‌జానికానికి చాలా సుప‌ర‌చితం. యామిని గతంలో టీడీపీలో పనిచేశారు. యామిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఎన్నికల సమయంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. 2019లో టీడీపీకి యామిని సాధినేని రాజీనామా చేశారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని.. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Yamini Sadineni

కొద్ది రోజుల త‌ర్వాత బీజేపీలోకి చేరిన యామినిని మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీగా నియమించారు. అయితే ఇప్పుడు ఆమె బీజేపీకు కూడా గుడ్ బై చెప్పి వైఎస్ఆర్‌సీపీలోకి వెళుతుంద‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ఇప్ప‌టికే టీడీపీ, బీజేపీకి చెందిన చాలా మంది వైసీపీ గూటికి చేర‌గా, ఇప్పుడు యామిని కూడా వారి దారిలో ప‌య‌నిస్తుంద‌ని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తనదైన దూకుడు ప్రదర్శించి అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన‌ యామిని. అప్పట్లో ప్రతిపక్షం వైసీపీతో పాటు జనసేన, బీజేపీల మీద కూడా ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గుర్తింపు పొందారు.

యామినీకి ప్ర‌స్తుతం బిజేపీ నేత‌ల‌తో పొస‌గ‌డం లేద‌ని తెలుస్తోంది. టీడీపీలో ఉన్న స్వేచ్ఛ‌ ఈ పార్టీలో లేక‌పోవ‌డం ఆమెను క‌లిచివేస్తోన్న అంశంగా ఆమె స‌న్నిహితుల స‌మాచారం. బీజేపీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడంతో పార్టీ ముఖ్య నేతలకు ఆమెకు గ్యాప్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఆమె స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు కూడా చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

యామినికి ప్ర‌స్తుతం ప్ర‌త్యామ్యాయం వైసీపీ త‌ప్ప మ‌రొక‌టి క‌నిపించ‌డం లేదు.ఈ క్ర‌మంలో యామిని వైసీపీలోకి ఎంట్రీ ఇస్తుంద‌ని స‌మాచారం. వైసీపీలో చేరడం ద్వారా టీడీపీలో ఉన్నప్పుడు సొంతపార్టీ నేతలే సొషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయించారని.. వాటికి కూడా సరైన సమాధానం చెప్పాలని యామిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో బాగంగానే వైసీపీ నేత‌ల‌తో ఆమె ట‌చ్ లోకి వెళ్లిన‌ట్లు స‌మ‌చారం. టీడీపీ నుండి వ‌చ్చిన రోజాను జ‌గ‌న్ మంచి అస్త్రంగా ఎలా వాడుకుంటున్నాడో, ఇప్పుడు యామిని కూడా అలానే ఉప‌యోగిస్తాడ‌ని ప్రచారం న‌డుస్తుంది.