పేకాట ఆడుతూ దొరికిన లేడీస్ , పోలీసులకి షాకింగ్ సమాధానం
Admin - January 7, 2021 / 06:34 PM IST

ఏపీలో పేకాట క్లబ్ లు పెరిగి పోతున్న నేపథ్యంలో సీఎం జగన్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పేకాట క్లబ్ లను క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పలు ప్రాంతాల్లో పేకాట కేంద్రాల్లో లక్షల్లో డబ్బును మరియు పదుల సంఖ్యలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. పేకాట క్లబ్ లను నిర్వహిస్తున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం లోని ఒక పేకాట క్లబ్ పై పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. అక్కడ ఆశ్చర్యకరంగా మహిళలు పేకాట ఆడుతు పట్టుబడ్డారు. వారు పేకాట ఆడటంపై పోలీసులు సైతం విష్మయం వ్యక్తం చేశారట.
పోలీసులకు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మహిళలు ఇదేమైనా మగవారు మాత్రమే ఆడే ఆటనా అంటూ ఎదురు ప్రశ్నించారట. దాంతో పోలీసులు నోరు వెళ్లబెట్టినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కొందరు తాము సరదాగా ఆడుతున్నామని, మగవారి మాదిరిగా మేము డబ్బులు పెట్టి ఆడటం లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశారట. ఈ సమయంలోనే పేకాట నిర్వాహకులను కూడా ప్రశ్నించగా తాము ఆడవారు మగవారు అని కాకుండా ఎవరు వచ్చినా కూడా ఆడుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారట.
విజయనగరం సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆడవారు పేకాట ఆడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక క్లబ్ లకు వెళ్లి మరీ పేకాట ఆడటం, వారు రైడ్ లో దొరకడం అంటే చిన్న విషయం కాదు. ఆడవారు అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నారు అని తెలుసు కాని మరీ ఇంతగా అభివృద్ది చెందుతున్నారు అని మాత్రం అనుకోలేదు అంటూ సోషల్ మీడియా జనాలు కామెంంట్ చేస్తున్నారు. కేవలం విజయనగరంలోనే ఆ వీర వనితలు ఉన్నారా ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.