Crime News: భ‌ర్త‌కు నిద్ర‌మాత్ర‌లు.. ఆపై ప్రియుడితో భ‌ర్త‌ను దారుణంగా చంపిన మ‌హిళ‌

Crime News: ఈ రోజుల్లో సంసార బంధానికి విలువ లేకుండా పోయింది. భ‌ర్త‌ను దేవుడిగా చూడాల్సిన భార్య‌లు వారిని హ‌త‌మార్చేందుకు కూడా వెన‌కాడ‌డం లేదు . ప‌రాయి వ్య‌క్తి మోజులో ప‌డి కిరాత‌కంగా చంపేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఓ సంఘ‌ట‌న గురించి వింటే అవాక్క‌వ‌డం ఖాయం.

Wife Kills Husband With Help of Boyfriend1
Wife Kills Husband With Help of Boyfriend1

నెల్లూరు జిల్లా కోవూరులో ప్రియుడి మోజులో పడ్డ ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చిన ఉదంతం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వై. హరినాథ్‌రెడ్డి నెల్లూరులోని స్థానిక సీఐ కార్యాలయంలో సంచలన విషయాలు వెల్లడించారు. రోజూ భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో సరసల్లాపాల్లో మునిగిపోయేదని వెల్లడైంది. చివరికి, భర్తకు అసలు నిజంతో తెలియడంతో ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

కోవూరు కొత్తూరు గ్రామానికి చెందిన బండికాల ర‌వీంద్ర ఈ నెల 7న ఏసీసీ క‌ళ్యాణ మండ‌పం సమీపంలో మృతి చెందారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని రవీంద్ర భార్య సమత కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. 14 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన సమతకు కలువాయి మండలం పెరమనకొండ గ్రామానికి చెందిన బండికాల రవీంద్రతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వివాహ‌మైన కొద్ది రోజుల‌కు కాపురం మార్చ‌గా, అక్క‌డ రవీంద్ర అల్లూరు మండలంలో ఓ చర్చికి పాస్టర్‌గా పని చేస్తున్నారు. సమత కోవూరు శాంతినగర్‌- 2 ప్రాంతానికి గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఉపర్తి రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ప్ర‌తి రోజు భ‌ర్త‌కు నిద్ర మాత్ర‌లు ఇచ్చి ప్రియుడితో రొమాన్స్‌లో మునిగేది. ఓ రోజు ఈ వ్య‌వ‌హారం భ‌ర్త‌కు తెలిసింది.

భ‌ర్త‌కు విష‌యం తెలిసింద‌ని స‌మ‌త‌కు తెలియడంతో ప్రియుడితో క‌లిసి ర‌వీంద్ర‌ను చంపేయాల‌ని ప‌న్నాగం ప‌న్నింది. ఇందులో భాగంగా, ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి సమయంలో ఉపర్తి రాముకు సమత ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. వారిద్దరూ గదిలో ఏకాంతంలో ఉండగా రవీంద్ర రెడ్‌హ్యాండెట్‌గా చూశారు. దీంతో సమత, రాము కలిసి రవీంద్ర ముఖానికి దిండు అడ్డు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.అనంత‌రం మృత‌దేహాన్ని ఏసీసీ కల్యాణ మండపం సమీపంలో జాతీయ రహదారిపై పడేసి రాయితో ముఖంపై అతి కిరాతంగా కొట్టారు.

మ‌ర‌ణాన్ని రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో రవీంద్ర గాయాలతో మృతి చెందలేదని ఊపిరి ఆడకుండా చేయడం వల్ల మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అనుమానాస్పద కేసును హత్యగా మార్పు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవీంద్ర భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకోగా, అటు తండ్రి, త‌ల్లి లేక ఇద్ద‌రు పిల్ల‌లు అనాథ‌లుగా మిగిలారు.