CM YS Jagan : రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంటే వైసీపీ, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు.?

NQ Staff - July 29, 2022 / 09:59 AM IST

CM YS Jagan : రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంటే వైసీపీ, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు.?

CM YS Jagan : రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందని వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల వాటాగా 41 శాతం ఇస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారాయన. పన్నుల వాటాల్లో కోతలు పెడుతున్నారనీ, సెస్సులు, పన్నులు పదే పదే పెంచుతూ ఆదాయం పెంచుకుంటున్న కేంద్రం, దానికి తగ్గట్టు రాష్ట్రాలకు వాటా ఇవ్వడంలేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

why not AP CM YS Jagan qutioning Modi govt

why not AP CM YS Jagan qutioning Modi govt

పన్నుల పంచాయితీ విషయమై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం వాదన మాత్రం వేరేలా వుంది. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా కేంద్రం వివిద రూపాల్లో నిధులు విడుదల చేస్తోందనీ, అదనంగా అప్పులు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు.

అప్పు.. ఎవరిది తప్పు.?

కేంద్రం కూడా అనూహ్యమైన రీతిలో అప్పులు చేస్తోన్న వైనాన్ని విజయసాయిరెడ్డి లెక్కలతో సహా బయటపెట్టారు. నిజమే, కేంద్రం ఇటీవలి కాలంలో గణనీయంగా అప్పులు చేసింది. అడ్డగోలుగా కేంద్రం అప్పులు చేస్తూ, అప్పుల విషయమై రాష్ట్రాలకు నీతులు చెప్పడం, క్లాసులు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.

కేంద్రం నుంచి సరైన సహకారం లేదని వైసీపీ భావిస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రాన్ని నిలదీస్తున్నట్లుగా వైసీపీ ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతోందన్నది ఓ కీలకమైన ప్రశ్న. ఈ విషయమై విజయసాయిరెడ్డి దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేని పరిస్థితి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us