ఏం.. ఆ పదవికి బాలయ్య అర్హుడు కారా.. ఇవ్వలేదెందుకని ?
Surya - November 17, 2020 / 04:30 PM IST

తెలుగుదేశం పార్టీ పేరుకి మాత్రమే నందమూరి కుటుంబానికి చెందిన పార్టీ. కానీ వాస్తవంలో మాత్రం ఆ కుటుంబానికి అందులో పెద్ద విలువేమీ లేదు. వ్యవస్థాపకుడు ఎన్ఠీఆర్ అయినప్పుడు, ఆయన కుటుంబంలో ఎంతోమంది వారసులు ఉన్నప్పుడు పార్టీలో కూడా వాళ్ళు ఉండాలి కదా. కానీ లేరు. లేకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. అప్పట్లో పార్టీని చేతుల్లోకి తీసుకోవాలని హరికృష్ణ నానా తంటాలు పడినా వీలుకాలేదు. ఆ తర్వాత అవసరాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు బాలయ్యకు చోటిచ్చారు. అది కూడ ఎమ్మెల్యే స్థాయి వరకే. ఉప ముఖ్యమంత్రి, మంత్రి లాంటి పదవులేవీ లేవు. ఇకపై ఉండవు కూడ.

Why Chandrababu not considered Balakrishna for party president post
ఈ సంగతి బాలయ్యకు కూడ తెలుసు. అందుకే పదవుల మీద ఆసక్తి లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే పరిస్థితి వారి చేయి దాటిపోయి చాలా కాలమే అయింది. సరే పార్టీని, అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులను అంటే ఇవ్వరు కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా ఇవ్వొచ్చు కదా అనేది నందమూరి వీరాభిమానులు డిమాండ్. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు బాలయ్య అయితే బాగుంటుందని, యువకులను బాగా ఆకట్టుకుంటారని చాలా అభిప్రాయాలే వెలువడ్డాయి. ఎలాగో నిర్ణయాలు చంద్రబాబే తీసుకుంటారు కాబట్టి ఎన్టీఆర్ వారసుడనే భావనతో అయినా అధ్యక్షుడిని చేయవచ్చు కదా అనే మాటలు వినబడ్డాయి.
కానీ చంద్రబాబు ఒప్పుకోలేదు. ఏరికోరి అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేశారు. అనుభవం పరంగా అచ్చెన్నాయుడు బాలయ్య కంటే సీనియర్, సామర్థ్యం కలవారు. అయితే చంద్రబాబు తలుచుకుంటే ఈ సామర్థ్యాలు, సీనియారిటీలు అడ్డంరావు. అయినా పార్టీలో అన్నీ పద్దతి ప్రకారమేమీ జరగటం లేదు కదా. అందుకే బాలయ్యను అధ్యక్షుడిని చేయాలని కోరుకున్నారు. కానీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకనుకున్న చంద్రబాబు ఆ సాహసం చేయలేకపోయారు. పోనీ లోకేష్ ఏమైనా బలంగా ఉంటే బాలయ్యను అధ్యక్షుడిని చేసేవారేమో. కానీ లోకేష్ బాబుకే చంద్రబాబు సపోర్ట్ అవసరం. ఇంకా ఆయన నిలదొక్కుకునే స్థాయిలోనే ఉన్నారు. ఈ టైంలో ఏదైనా తేడా జరిగితే భవిష్యత్ నాయకుడి స్థానానికి పోటీ ఏర్పడవచ్చనేది బాబుగారి భయం కాబోలు.