Pattabhi : పట్టాభి మర్డర్ అటాక్ వెనక ఉన్నవాళ్ళు దొరకబోతున్నారు ? కీలక ఆధారం దొరికింది ?

Pattabhi (పట్టాభి) : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మంగళవారం నాడు టీడీపీ కార్యాలయానికి బయలుదేరుతుండగా సుమారు 15 మంది దుండగులు నలువైపుల నుంచి విరుచుకుపడి ఆయన ఇంటిముందే కర్రలు, రాళ్లతో దాడి చేశారు. పట్టాభిరాం కారులో కూర్చోగానే ఈ దాడికి పాల్పడ్డారు. కొందరు ఇనుపరాడ్ల తో కూడా కారుపై దాడి చేయడంతో పట్టాభిరామ్ కి తీవ్రగాయాలయ్యాయి. ముఖ్యంగా ఆయన చేతికి తీవ్ర గాయం అయింది. కాళ్లకు కూడా బాగా గాయాలు కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే దాడి చేస్తున్న సమయంలో ఒక రాడ్ పట్టాభిరాం జేబుకి వేగంగా వచ్చి గుచ్చుకుంది. దీనితో ఆయన జేబులో ఉన్న సెల్ ఫోన్ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ దాడిలో పట్టాభిరామ్ డ్రైవర్ కూడా బాగా గాయపడ్డాడని తెలుస్తోంది.

Whi is Behind TDP leader pattabhi Attack పట్టాభి
Whi is Behind TDP leader pattabhi Attack

విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనపై స్పందించిన పట్టాభిరామ్.. వల్లభనేని వంశీ, కొడాలి నాని తనకు గత పది రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారని.. వాళ్లే మనుషులను పంపించి దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. ఐతే గతంలో కూడా పట్టాభిరాం పై దాడి జరిగింది కానీ నిందితులను పోలీసులు పట్టుకోలేదు. దీనితో మళ్ళీ వారే పట్టాభిరాం పై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

పట్టాభిరాం టీడీపీ పార్టీ లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నా ఆయన ప్రభుత్వం పై అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆయన నోరు మూయించడానికి వైసీపీ నేతలే దాడి చేయించి తమ పేరెత్తితే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడి పై చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. పోలీసుల ఉదాసినత కారణంగా వైసీపీ గుండాల దౌర్జన్యం పేట్రేగిపోతోంది అని ఆయన ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూల్ అఫ్ లా లేదనడానికి పట్టాభి పై జరిగిన దాడి సాక్ష్యం అని ఆయన అన్నారు.

Advertisement