YS Jagan : సహచర మంత్రులపై వైఎస్ జగన్‌ కోపానికి కారణమేంటి.?

NQ Staff - September 7, 2022 / 10:41 PM IST

157122YS Jagan : సహచర మంత్రులపై వైఎస్ జగన్‌ కోపానికి కారణమేంటి.?

YS Jagan : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సహచర మంత్రుల్లో కొందరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. అది కూడా క్యాబినెట్ సమావేశంలోనట. అలాగని తొలుత టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది నిజమేనంటూ వైసీపీ అనుకూల మీడియా కూడా కథనాలు షురూ చేసింది.

What is the reason for YS Jagan anger on fellow ministers

What is the reason for YS Jagan anger on fellow ministers

ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కాక, మూడేళ్ళ తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి ఇలా సహచర మంత్రుల మీద మండిపడ్డారన్నది మీడియాలో వినిపిస్తోన్న కథనాల సారాంశం. కానీ, ఎందుకు.?

లిక్కర్ స్కామ్ భయపెడుతోందా.?

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాయట.

‘దారుణాతిదారుణంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆ కథనాలపై మీరెందుకు స్పందించడంలేదు.? మీరు టీడీపీ అనుకూల మీడియాకి భయపడుతున్నారా..’ అంటూ వైఎస్ జగన్, తన సహచర మంత్రుల్ని నిలదీశారట.

నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతి మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తుండడంతోనే ఇంతలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారన్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ వైఎస్ జగన్ ఇంతలా అసహనం వ్యక్తం చేయకపోవడం.. ఇప్పుడే సహచర మంత్రుల మీద మండిపడటం.. దేనికి సంకేతం.?