Tirupati Laddu : తిరుపతి లడ్డూకి ఏమయ్యింది.? ఎందుకీ వివాదం.?
NQ Staff - November 10, 2022 / 05:36 PM IST

Tirupati Laddu : తిరుపతి లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి కొత్తగా చెప్పేదేముంది.? తిరుపతి లడ్డూ అంటే అది మహా ప్రసాదం.! గతంలో అయితే, ఎన్ని రోజులైనాగానీ లడ్డూ పాడయ్యేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నది నిర్వివాదాంశం.!
రుచిలోనూ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అని భక్తులే చెబుతుంటారు. పెద్ద సంఖ్యలో లడ్డూలనీ తయారు చేస్తుండడంతో, లడ్డూ అనేది ప్రసాదం అనడం కంటే.. లడ్డూ విక్రయాన్ని ఓ వ్యాపారంగా టీటీడీ మార్చేసిందన్న విమర్శలు లేకపోలేదు.
బరువు తగ్గిందేలా..?
తిరుపతి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు వుంటుంది సాధారణంగా అయితే. కానీ, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూల బరువు 90 నుంచి 110 గ్రాములు మాత్రమే తూగడంతో, విషయాన్ని కౌంటర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్ళాడడు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బరువు కొలిచే యంత్రంలో సాంకేతిక సమస్యను కారణంగా చూపుతున్నారు అధికారులు. కాంట్రాక్టు సిబ్బంది అవగాహనా లోపం కూడా వుందని అంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
లడ్డూ నాణ్యతపై విమర్శలు ఈ మధ్య తరచూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయినాగానీ, భక్తుల విశ్వాసాల్ని టీటీడీ పరిగణనలోకి తీసుకోవడంలేదన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.