YS Jagan : అప్పుడు వెంట్రుక.. ఇప్పుడు జుట్టు.! ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఏమైంది.?

NQ Staff - September 30, 2022 / 09:34 PM IST

YS Jagan : అప్పుడు వెంట్రుక.. ఇప్పుడు జుట్టు.! ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఏమైంది.?

YS Jagan : ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది.! అప్పుడేమో, ‘వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ విపక్షాల్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలోనే.. ఓ అధికారిక బహిరంగ సభలో వ్యాఖ్యానించడం పెను సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి, ఇలా మాట్లాడొచ్చా.? అంటే, ఏం.. ఎందుకు మాట్లాడకూడదు.? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాగానీ, ‘మా మీద విమర్శలు చేస్తే, మా కార్యకర్తలకు బీపీ వస్తుంది..’ అంటూ టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిపై వ్యాఖ్యానించిన ఘనుడాయన.. ఆయన ఏమైనా మాట్లాడతారు.

ఎందుకు తేడా కొడుతోందబ్బా.?

మొన్నేమో వెంట్రుక కూడా పీకలేరన్నారు. ఇప్పుడేమో, ‘జుట్టు వుంటేనే ముడి వేసుకోవడానికి అవుతుంది..’ అంటూ ‘వర్క్ షాప్’లో వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. దానర్థమేంటి.? ప్రజలు వెంట్రుకల్ని పీకేయడం మొదలెట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అర్థమయ్యిందా.? అంటూ సోషల్ మీడియాలో పంచ్ డైలాగులు పేలుతున్నాయి.

వెంట్రుక గురించీ, జుట్టు గురించీ అప్పుడూ.. ఇప్పుడూ.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నిజానికి, ఆ కాంటెక్స్‌ట్ వేరు.. ఈ కాంటెక్స్‌ట్ వేరు. కానీ, రాజకీయాల్లో అలా కుదరదు. బోడి గుండుకీ, మోకాలికీ ముడి పెట్టడం మొదలు పెట్టిందే వైసీపీ.. అన్న విమర్శ వుండనే వుంది కదా.! ఈ వీడియోపై ఎలా రియాక్ట్ అవ్వాలో వైసీపీ శ్రేణులకు అర్థం కావడంలేదు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us