Vishaka-Chiru : ‘‘విశాఖ ఉక్కు’’పై చిరంజీవి రెండోసారి..

Vishaka-Chiru : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయొద్దంటూ మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒకసారి రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన అప్పట్లో ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. సినిమా పరిశ్రమలోని అందరి కన్నా ముందు చిరంజీవే దీనిపై స్పందించారు. తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన రెండోసారి మోడీ సర్కారుకు విజ్ఞప్తి చేయటం గమనార్హం. ఈ మేరకు మెగాస్టార్ ఇవాళ గురువారం ట్విట్టర్ వేదికగా ముందుకొచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలనుకోవటం పట్ల పునరాలోచించాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కలుగుతున్న ప్రాణనష్టాన్ని నివారించటంలో ఈ ఉక్కు పరిశ్రమ అందిస్తున్న సేవలను చిరంజీవి ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.

Vishaka-Chiru : megastar chiranjeevi again reacts on vishaka
Vishaka-Chiru : megastar chiranjeevi again reacts on vishaka

ఆపద్భాంధవి..

ఉక్కు ఉత్పత్తి విషయంలోనే కాకుండా ఆక్సీజన్ సరఫరా విషయంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ వివిధ రాష్ట్రాలకు సర్వీస్ చేస్తోందని మెగాస్టార్ తన ట్వీట్ లో గుర్తు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా కొవిడ్-19 పేషెంట్లు ప్రాణవాయువైన ఆక్సీజన్ దొరక్క అల్లాడిపోతుంటే ఇవాళ ఒక స్పెషల్ ట్రైన్ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకి చేరుకుంది. అక్కడి నుంచి మహారాష్ట్రకి 150 టన్నుల ఆక్సీజన్ ని తీసుకెళుతోంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ స్వయంగా రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సీజన్ ని ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సీజన్ ని అందించి లక్షలాది మంది రోగుల ప్రాణాలను కాపాడుతోంది. ఇలాంటి ఆపద్భాంధవి అయిన ఉక్కు కర్మాగారాన్ని నష్టాల్లో ఉందనే సాకుతో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం ఎంత వరకు కరెక్టో మీరే ఇంకోసారి ఆలోచించండి’’ అని చిరంజీవి తనదైన స్టైల్లో, సరైన సమయంలో, సరైన విధంగా కేంద్రానికి తన బాధ్యతను గుర్తు చేశారు.

మీ ‘అభినందన’: Vishaka-Chiru

వయసు 45 ఏళ్లు పైబడిన సినీ ఆర్టిస్టులకు, జర్నలిస్టులకు హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ తో కలిసి ఫ్రీగా వ్యాక్సిన్ అందించేందుకు లెజెండరీ మెగాస్టార్ ముందుకు రావటం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి చిరంజీవి రిప్లై ఇస్తూ ‘‘మేడం మీ అభినందనలు ఎంతో విలువైనవి. కరోనా క్రైసిస్ ఛారిటీకి సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికీ ఇవి దక్కుతాయి’’ అని పేర్కొన్నారు.

Advertisement