Vijayasai Reddy : పాదయాత్ర సూపర్ సక్సెస్ అని ఫీల్ అవుతున్న విజయ్ సాయిరెడ్డికి బిగ్ ఝలక్?

Vijayasai Reddy : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షించుకోవటానికి పార్లమెంట్ లోపల, బయట ఎక్కడైనా పోరాడతామని ప్రకటించిన వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు నిన్న (శనివారం) వైజాగ్ లో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. విశాఖ జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ స్టాట్యూ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు 24 కిలోమీటర్ల మేర ఐదు నియోజకవర్గాల మీదుగా పూర్తి చేసిన ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని ఆయన లోపల ఫీల్ అవుతుండటమే కాకుండా పైకి కూడా తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, ఈ ప్రోగ్రామ్ విజయసాయిరెడ్డికి పెద్దగా ప్లస్ అవకపోగా బిగ్ ఝలక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎందుకు?..

విశాఖ ఉక్కు పరిరక్షణ పేరిట విజయసాయిరెడ్డి పాదయాత్ర చేసినంత మాత్రాన ఆ స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్రం తన పెట్టుబడులను విత్ డ్రా చేసుకోకుండా ఆగదు. ఆ విషయం విజయసాయిరెడ్డికే కాదు ప్రజలకూ తెలుసనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే మోడీ సర్కారు ఒక నిర్ణయం తీసుకుందంటే వెనక్కి పోయిన సందర్భం లేదని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. కొత్త సాగు చట్టాల రద్దుకి రైతులు నెలల తరబడి ఆందోళన చేస్తున్నా కేంద్రం దిగిరాకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వబోమని గతంలోనే ఒకటీ రెండు సార్లు చెప్పింది. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోడీని అడిగినా, ఆయన ఎంపీలు గతంలో పార్లమెంటులో డిమాండ్ చేసినా అనుకూల ప్రకటన వచ్చిన దాఖలా లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం విజయసాయిరెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించినా బీజేపీ ప్రభుత్వం లైట్ తీసుకుంటుందని పేర్కొంటున్నారు. దీన్నిబట్టి ఆయనకి ఇంతకన్నా పెద్ద ఎదురుదెబ్బ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు.

Vijayasai Reddy : setback for ysrcp leader vijayasaireddy after his padayathra
Vijayasai Reddy : setback for ysrcp leader vijayasaireddy after his padayathra

క్రెడిట్: Vijayasai Reddy

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం తెర మీదికి వచ్చిన వెంటనే ముందుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత అదే పార్టీకి చెందిన పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిసి విశాఖ ఉక్కు విషయంలో పునరాలోచించాలని కోరారు. అంతకుముందే జగన్ కేంద్రానికి లేఖ రాసినప్పటికీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న పార్టీగా వైఎస్సార్సీపీకి క్రెడిట్ దక్కట్లేదు. ఈ లోటును భర్తీ చేయటానికే విజయసాయిరెడ్డి పాదయాత్రకు పూనుకున్నారు తప్ప నిజంగా ఆ ఫ్యాక్టరీని సేవ్ చేయటం కోసం కాదని చెబుతున్నారు. తాజాగా నిన్న రాత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీంతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన టీడీపీ విజయసాయిరెడ్డి ఆయన పాదయాత్ర చేసిన రోజే ఇన్ డైరెక్టుగా షాకిచ్చింది.

Advertisement