Vijayasai Reddy : మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి.! రామోజీరావుకి అల్టిమేటం.!
NQ Staff - October 11, 2022 / 06:53 PM IST

Vijayasai Reddy : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, మీడియా మొఘల్‌గా పిలవబడే రామోజీరావుని తెలుగుదేశం పార్టీ ‘కుల’ గురువు అనీ, ‘రాజగురువు’ అనీ అంటుంటారు. ఆ రామోజీరావు అంటే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్సలేమాత్రం పడదు.
చిత్రంగా ‘రామూ’ అంటూ ముద్దుగా రామోజీరావు పేరు ప్రస్తావిస్తూ, తానూ మీడియా రంగంలోకి వస్తున్నానంటూ అల్టిమేటం జారీ చేశారు వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.
రాజకీయాల్లో సంచలనం.. సాక్షి సంగతేంటి.?
సాక్షి న్యూట్రల్ మీడియా సంస్థ అనీ, ఈనాడుకి ధీటుగా కౌంటర్ ఎటాక్ చేస్తూ, వైసీపీ తరఫున సాక్షి గట్టిగా నిలబడలేక పోతోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరు. సాక్షి అంటేనే అది జగన్ మీడియా సంస్థ. వైఎస్ జగన్ ఎలా చెబితే అలా నడుచు కుంటుంది సాక్షి.
కానీ, విజయసాయి రెడ్డికి కొత్తగా మీడియా సంస్థ స్థాపించాల్సిన అవసరమేంటి.? సాక్షిలో ఎటూ విజయసాయిరెడ్డికి అనుకూలంగానే వార్తలొస్తాయ్. వైసీపీ మీద ఎవరన్నా విమర్శలు చేస్తే, సాక్షి నుంచి కౌంటర్ ఎటాక్ చాలా గట్టిగా వస్తుంటుంది.
అలాంటి సాక్షిలో తప్పు రాస్తారు అధ్యక్షా.. అని ఆ మధ్య అసెంబ్లీలోనే, సన్న బియ్యం వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారాయె.
మరి, విజయసాయిరెడ్డి పెట్టబోయే మీడియా సంస్థల్లో అన్నీ వైసీపీకి తగ్గట్టుగా, అన్నీ వాస్తవాలే రాస్తారా.? వేచి చూడాల్సిందే.