రాజకీయాల్లో ఈ స్థాయి టార్చర్ బాలయ్య ఎప్పుడూ అనుభవించి ఉండరేమో !
Surya - November 7, 2020 / 05:34 PM IST

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ నేత శ్రీభరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ విద్యా సంస్థల మీద ప్రభుత్వం డేగ కన్ను వేసింది. అక్రమంగా 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని యూనివర్సిటీ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ ఆ నిర్మాణాలకు కూలగొట్టింది. నేరుగా బాలకృష్ణ అల్లుడినే టచ్ చేయడంతో టీడీపీలో అలజడి మొదలైంది. మొదటి నుండి పార్టీలో ఎంత పెద్ద వివాదం చెలరేగినా బాలయ్య కలుగజేసుకునేవారు కాదు. కానీ తన అల్లుడికే ఇబ్బంది రావడంతో బాలకృష్ణ వ్యవహారంలోకి ఎంటరైఅం ట్టు టీడీపీ వర్గాలు చర్చ నడుస్తోంది. అయితే భవనాలను కూలగొట్టాడంటప్ని వైసీపీ ఆగిపోలేదు. ఇంకాస్త దూకుడుగా ముందుకువెళ్లింది.
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి గీతం సంస్థ గురించి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కి లేఖ రాసిన ఆయన గీతం యాజమాన్యం భూఆక్రమణలకు పాల్పడిందని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ కోసం అనుమతులు పొందిందని పిర్యాదు చేశారు. వాస్తవాలను దాచిపెట్టి అక్రమ రీతిలో ఏఐసీటీఈ నుంచి అనుమతులు సంపాదించిందని, తద్వారా ఏఐసీటీఈ నియమ నిబంధనలను ఉల్లంఘించిందని దీనిపై విచారణ జరపాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్దేకు లేఖ రాశారు.
అంతేకాకుండా భవనాలు ప్రభుత్వానికి చెందిన ఆక్రమిత భూభాగంలో నిర్మించిన విషయాన్ని దాచిపెట్టి గీతం ఏఐసీటీఐ నుంచి ఇంజనీరింగ్ కోర్సులకు అనుమతులు సంపాదించింది. తద్వారా ఏఐసీటీఈని గీతం యాజమాన్యం తప్పుదారి పట్టించింది. యూజీసీ ద్వారా కేటగిరీ 1 గ్రేడ్‌తో స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థ హోదాను దక్కించుకున్న గీతం ఇలాంటి దురాక్రమణలకు పాల్పడింది అంటూ తక్షణమే విచారణ కమిటీని నియమించాలని కోరారు. విజయసాయి ఇలా వెంట వెంటనే కేంద్ర స్థాయి సంస్థలకు లేఖలు రాయడం చూస్తే అంత సులువుగా వ్యవహారాన్ని వదిలేలా కనిపించట్లేదు. ఇప్పటికే రంగంలోకి దిగారని చెబుతున్న బాలయ్య పెద్దగా చేసిందేమీ లేదు. అలాంటిది విజయసాయిరెడ్డి ఫిర్యాదుల నుండి అల్లుడిని ఎలా కాపాడగలరనే అనుమానం కార్యకర్తలను వేధిస్తోంది. మొత్తానికి బాలయ్యను ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని టార్చర్ చూస్తున్నారు.