ఇరవై వేల కోట్లు ‘ అంటూ జగన్ ని పెర్ఫెక్ట్ గా బుక్ చేసిన ఉండవల్లి !

Mamatha 600 - November 29, 2020 / 05:22 PM IST

ఇరవై వేల కోట్లు ‘ అంటూ జగన్ ని పెర్ఫెక్ట్ గా బుక్ చేసిన ఉండవల్లి !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం చాలా చులకనగా ట్రీట్ చేస్తోందని.. ఈ పరిస్థితిని చూస్తుంటే తనకు చాలా బాధేస్తోంది అని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఎంతో అన్యాయం చేస్తున్నా.. ప్రశ్నించడానికి ఎవరు సాహసించడం లేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించినప్పుడు 20 వేల కోట్ల కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వమని.. ఇక ఇవ్వాల్సింది కేవలం 7 కోట్లు లేనని.. భూసేకరణ, పునరావాసం తో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి లేఖ రాయడం చాలా అవమానకరమని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడు వీరోచితంగా పోరాడి రాష్ట్రానికి తెచ్చిన ప్రత్యేక హోదా గురించి జగన్ సర్కార్ ఎందుకు అడగటం లేదని నిలదీశారు.

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

కేంద్రం రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేస్తున్నా తిరిగి ప్రశ్నించడానికి ఎందుకు ధైర్యం చేయడం లేదు? సీబీఐ కేసులు ఉన్నాయని భయపడుతున్నారా? అని మాజీమంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టుని ఎక్కువ ఎత్తులో కట్టాల్సిన అవసరం లేదని రిజర్వాయర్‌లో నీరెంత ఉండాలో చూసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చిన ఉండవల్లి.. పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల వరకు కట్టి… గ్రావిటీ ద్వారా నీరిస్తే ఎవరు ప్రశ్నిస్తారు అని ఆయన అన్నారు. చిన్న పాటి కేసులను పరిష్కరించడానికి పెద్ద లాయర్లకు కోట్లు కుమ్మరించి వాదనలు వినిపించడం వృధా అని చెప్పుకొచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం విషయంలో పెద్ద లాయర్లను నియమించి వాదనలు వినిపించాలని జగన్ సర్కార్ కి హితబోధ చేశారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us