Umamaheswari : స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఇటీవల అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. తొలుత అనారోగ్యంతో ఆమె కన్ను మూసినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత అది ఆత్మహత్యగా తేలింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఉమమహేశ్వరి మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించారు. మరోపక్క, ఉమామహేశ్వరి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, చాలా రాజకీయ ఆరోపణలు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే.
హూ కిల్డ్ పిన్ని..
ప్రధానంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ మీదనే అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావడంతో, ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడినట్లే భావించాలేమో. అయితే, ఆమెను ఆత్మహత్య దిశగా ప్రేరేపించింది చంద్రబాబేనన్న రాజకీయ విమర్శలు మాత్రం ఇప్పట్లో ఆగేలా లేవు.