Jagan: థ్యాంక్యూ సో మచ్ జగన్

Jagan: మహారాష్ట్రలో కరోనా వైరస్ వల్ల అల్లాడుతున్న ప్రజల ప్రాణాలను దృష్టి పెట్టుకొని అడిగిన వెంటనే కాదనకుండా వారం రోజుల్లో 300 వెంటిలేటర్లను పంపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు మూడు రోజుల కిందట హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ చేసి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసిన సాయానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది మరాఠీలు కూడా ఏపీ గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలిపేందుకు గడ్కరీ బాట పట్టారు. సోషల్ మీడియాని ఈ సందేశాలతో హోరెత్తిస్తున్నారు.

ఏపీలోనూ సీరియస్.. అయినా..

ఏపీలో కూడా కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉన్నప్పటికీ మహారాష్ట్రలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. చేతులు దాటిపోయే ప్రమాదం నెలకొంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని ప్రదర్శించింది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పౌరులు సామాజిక మాధ్యమాల్లో గుర్తుచేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు పంపిన ఈ వెంటిలేటర్లను విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్(ఏఎంటీజెడ్)లో తయారుచేశారు. వెంటిలేటర్లతోపాటు 150 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సీజన్ ని కూడా 10 క్రయోజనిక్ ట్యాంకర్లలో ఒక ఎక్స్ ప్రెస్ రైల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) నుంచి మహారాష్ట్రకు గురువారం పంపిన విషయం విధితమే.

మొన్నే ట్విట్టర్ లో..

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి, తనకి మధ్య జరిగిన ఈ కమ్యూనికేషన్ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొన్న శుక్రవారం ట్విట్టర్ లో పంచుకున్నారు. అనంతరం మహారాష్ట్రకు చెందిన సంజయ్ సోనావానే అనే ఒక డాక్టర్.. వైఎస్ జగన్ కి ‘థ్యాంక్యూ సో మచ్’ అని పేర్కొన్నారు. ‘శివసేన మహారాష్ట్ర’ సైతం మరాఠీలో ధన్యవాదాలు తెలిపింది. ప్రభాత్ ఎస్ఎస్ కుచిక్ అనే వ్యక్తీ ఇదే విధంగా స్పందించారు.

Advertisement