జగన్ తస్మాత్ జాగ్రత్త : తిరుపతి లో దుబ్బాక మళ్ళీ రిపీట్ ?? విప్లవం స్టార్ట్ ?

Tirupati parliament by elections like Dubbaka 
Tirupati parliament by elections like Dubbaka 
తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంను సునాయాసంగా బీజేపీ గెలుపొందింది. టీఆర్‌ఎస్‌ అతి విశ్వాసమో లేదా వారిపై జనాల్లో వచ్చిన వ్యతిరేకత కారణమో లేదంటే బీజేపీపై పెరిగిన నమ్మకమో కాని దుబ్బాకలో బీజేపీ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో ఏదో రాజకీయ మార్పు రాబోతుందా అనే సంకేతాన్ని అందరికి అందిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ హోరా హోరీగా తలపడింది. ఎప్పుడు మూడవ లేదా నాల్గవ స్థానంలో ఉండే బీజేపీ మేయర్‌ పీఠంపైనే దృష్టి పెట్టింది. బీజేపీ కేంద్రంలో బలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా అదే పార్టీకి మద్దతుగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతుంది. ఇదే సెంటిమెంట్‌ తిరుపతి ఉప ఎన్నికలో కూడా రిపీట్‌ అయితే ఖచ్చితంగా అద్బుతం ఏదో జరగడం ఖాయం అంటున్నారు.
Tirupati parliament by elections like Dubbaka 
Tirupati parliament by elections like Dubbaka
వైకాపా సిట్టింగ్‌ స్థానం అయిన తిరుపతి పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జనసేనానిని ఢిల్లీకి పిలిపించుకుని నడ్డా చర్చలు జరిపారు. ఆ సమయంలో తిరుపతి ఉప ఎన్నిక గురించి ప్రధానంగా చర్చ జరిగినట్లుగా రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక టీడీపీ కూడా ఎలాగూ గెలవడం సాధ్యం కాదు కనుక బీజేపీకి కాస్త సైడ్‌ ఇద్దాం అన్న రీతిలో బలమైన క్యాండిడేట్‌ ను కాకుండా వీక్‌ క్యాండిడేట్‌ ను పెట్టే విషయమై ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వైకాపా అధికారం ఉన్నదనే అహంకారంతో దూకుడుగా వ్యవహరిస్తూ చాలా మందిని ఇబ్బంది పెట్టింది అనేది చాలా మంది అభిప్రాయం. వారు ఇప్పుడు తిరుపతిలో వైకాపా ఓటమిని కోరుకుంటున్నారు.
వైకాపా జాగ్రత్తగా ఉండకుంటే.. కేసీఆర్‌ మాదిరిగా దుబ్బాకను లైట్‌ తీసుకుంటే ఖచ్చితంగా జగన్‌ కు షాక్‌ ఇచ్చే ఫలితం అక్కడ నమోదు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. ఏపీలో ఇప్పటికే బీజేపీ గాలి బలంగా వీస్తుంది. నెం.2 గా ఉన్న కాంగ్రెస్‌ కంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బీజేపీనే అధికంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో ఏపీలో కూడా బీజేపీ జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఆపార్టీ నాయకులు ఇదే అదునుగా తిరుపతి ఉప ఎన్నికలకు భారీ ఎత్తున జాతీయ నాయకులను దించి గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. దుబ్బాక సీన్‌ రిపీట్‌ అయితే ఏపీలో బీజేపీ అనూహ్యంగా పుంచుకుని వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. జనసేన పార్టీకి కూడా తిరుపతి ఎన్నిక బలాన్ని ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here