Nimmagadda: ‘‘నిమ్మగడ్డ’’ ప్లేసులో ముగ్గురి పేర్లు

Nimmagadda నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అఫిషియల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఏపీఎస్ఈసీ)గా ఆయన పదవీ కాలం ఈ నెల 31తో (మరో వారం రోజుల్లో) ముగియనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం తదుపరి ఎస్ఈసీగా ముగ్గురి పేర్లను గవర్నర్ కార్యాలయానికి పంపింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ల ప్యానెల్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లు నూతన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. రీసెంటుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొంది, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని ఈ ముగ్గురిలో ఒకరు. ఈమెతోపాటు ‘నవ రత్నాల’ని పర్యవేక్షిస్తున్న సలహాదారు ఎం.శామ్యూల్, రాష్ట్ర పునర్విభజన విభాగ బాధ్యుడు ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి ఈ జాబితాలో ఉన్నారు.

సాధ్యమైనంత త్వరగా..

ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎస్ఈసీగా నియమిస్తే.. మధ్యలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఎలక్షన్స్ ముగిశాక కొవిడ్-19 వ్యాక్సినేషన్ ని ముమ్మరం చేయనున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో టీకాల కార్యక్రమాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. కాగా.. తదుపరి ఎస్ఈసీ కోసం ఏపీ గవర్నమెంట్ ఈ ముగ్గురి పేర్లను సూచించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించినప్పుడు తమిళనాడు నుంచి జస్టిస్ ఎస్.కనగరాజ్ ని ఆ పదవిలో నియమించారు. కానీ ఆ నిర్ణయాన్ని కోర్టు కొట్టేయటంతో మళ్లీ నిమ్మగడ్డకే అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి కనగరాజ్ కి ఛాన్స్ ఇస్తారని చాలా మంది భావించినా అలా జరగలేదు.

‘నీలం’కి కష్టమేనా?..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పనిచేసిన నీలం సాహ్నీ ఎస్ఈసీగా వెళ్లటం అంటే ఆమె తనకుతాను తన ప్రాధాన్యతను తగ్గించుకున్నట్లుగా ఉంటుంది. మరో వైపు.. జగన్ సర్కారు నవరత్నాలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అందువల్ల దాని బాధ్యతలు మోస్తున్న ఎం.శామ్యూల్ ని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పంపకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వీళ్లిద్దర్నీ తీసేస్తే ఇక మిగిలింది ఒక్కరే. ఆయనే ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి. ఈయనకు సామాజిక వర్గం కూడా ప్లస్ అవుతుంది. కాబట్టి ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డే కొత్త ఎస్ఈసీ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement