YS Viveka : వివేకా హత్యకేసు.. పులివెందుల వైకాపా కార్యలయంలో సీబీఐ
NQ Staff - January 23, 2023 / 08:02 PM IST

YS Viveka : మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు నేడు కడప జిల్లా పులివెందులలో దర్యాప్తు నిర్వహించారు.
అక్కడి వైకాపా కార్యాలయానికి వెళ్లి సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారట. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది చెప్పడంతో సిబిఐ అధికారులు అక్కడి నుండి వెనుతిరిగారు అంటూ సమాచారం అందుతుంది.
భాస్కర్ రెడ్డి వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి అనే విషయం తెలిసిందే. గతంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి తన తండ్రిని చంపిన 15 మంది అనుమానితుల్లో భాస్కర్ రెడ్డి పేరును కూడా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఆయనను సిబిఐ అధికారులు విచారించేందుకు వైకాపా కార్యాలయానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ కేసు ముందు ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.