AP: సీఎం జగన్ మొదలుకొని అంతా అలర్ట్ అవుతున్న ఆంధ్రప్రదేశ్

AP: రాష్ట్రంలో భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అప్రమత్తమవుతోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రకృతి వైపరీత్యం దృష్ట్యా ముందుగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మరీ ముఖ్యంగా కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని, ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జాగ్రత్తపడాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతోపాటు అన్ని విభాగాల యంత్రాంగం అలర్టుగా ఉండాలని చెప్పారు. అంతకుముందు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన ఆన్ లైన్ మీటింగులో పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా ఇవాళ వర్చువల్ గా భేటీ అయ్యారు. అందులో ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు.

ap cm jagan

ప్రత్యామ్నాయాలు చూడాలి..

ఆక్సీజన్ ప్రొడక్షన్, రీఫిల్లింగ్ ప్లాంట్లకు కరెంట్ సరఫరాలో అవాంతరాలు తలెత్తకుండా చూడాలని సీఎం జగన్ కేంద్ర హోం శాఖ మంత్రిని కోరారు. ఒడిశా నుంచి ప్రాణవాయువు రవాణాకు అనుకోని ఆటంకం కలిగితే ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలని రిక్వెస్ట్ చేశారు. సంబంధిత టెక్నికల్ టీమ్ ని అడ్వాన్స్ గా రెడీ చేయాలని సూచించారు. తుఫాన్ సిగ్నల్స్ ని బట్టి చూస్తుంటే దాని ప్రభావం ఏపీపై కొద్దిగానే ఉండేట్లు కనిపిస్తోందని, అయినప్పటికీ వాస్తవ పరిస్థితిపై సరైన అంచనాతో ముందడగు వేస్తున్నామని వివరించారు. కొవిడ్ పేషెంట్లను ఇతర ఏరియాలకు షిఫ్ట్ చేయాల్సి వస్తే వెంటనే రంగంలోకి దిగాలని పేర్కొన్నారు.

ap cm jagan

ఆ మూడు జిల్లాల్లో..

తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని అధికారులు సీఎం జగన్ కి తెలిపారు. అవసరమైతే కరోనా రోగులను తక్షణం వేరే ప్రాంతాలకు తీసుకెళతామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని చెప్పారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోనే ఈ రెండు సమావేశాలు జరిగాయి. ఈ భేటీల్లో వివిధ శాఖల బాధ్యులు పాల్గొన్నారు.