డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు అనుమతిచ్చిన హైకోర్ట్

ఏపీలోని విజయవాడ స్వర్ణ కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబును విచారించేందుకు హై కోర్ట్ అనుమతి ఇచ్చింది. అయితే ఆయన ను కస్టడీలోకి తీసుకోవాలని శుక్రవారం కోర్ట్ సూచించింది. దీనితో నిందితున్ని అదుపులోకి తీసుకోని నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు విచారణ జరపనున్నారు. అంతేకాదు ఒక న్యాయవాది అధీనంలో విచారణ జరపాల్సిందిగా కోర్ట్ సూచించింది.

ap high court questions ap govt over election commission issue

అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ ఆసుపత్రిగా నియమించిన రమేష్ ఆసుపత్రి వారు ఏర్పాటు చేసిన స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ఈ అగ్ని ప్రమాదంలో పది మంది మరణించగా, ఇరువై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ ఘటన అనంతరం రమేష్ బాబు తప్పించుకు తిరిగాడు. తరువాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని రోజులనుండి ఈ ఘటన కేసు పెండింగ్ లో ఉండగా తాజాగా హై కోర్ట్ స్పందించింది.

దీనితో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు ను విచారించేందుకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ కేసు విషయంలో ఇప్పటికే ప్రముఖ టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని స్పందించిన విషయం తెలిసిందే. రామ్ కు నిందుతుడు రమేష్ బాబు స్వయానా బాబాయ్ అవుతాడని తెలుస్తుంది.

Advertisement