TDP: పచ్చ బ్యాచ్ కి.. పిచ్చి ముదిరింది..
Kondala Rao - May 3, 2021 / 02:57 PM IST

TDP గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా పచ్చ బ్యాచ్ ని తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్న తిరుపతి బైఎలక్షన్ లోనూ కళ్లు బైర్లు కమ్మేలా తీర్పిచ్చారు. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థంకావట్లేదు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల సాయంతో విజయం సాధించిందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ సోమవారం ఆరోపించారు. తద్వారా డాక్టర్ గురుమూర్తికి ఓటేసినవాళ్లందరూ దొంగలనే అర్థం వచ్చేలా మాట్లాడారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి డైరెక్టుగా ఇదే మాట అన్నారు. తనకు ఓట్లేసినవాళ్లు మాత్రమే ఓటర్లు అని చెప్పారు. అంటే మిగతా వాళ్లు ఓటర్లు కాదు.. దొంగ ఓటర్లు అనే కదా?. ఓటర్లకు, ఏపీ ప్రజలకు అపొజిషన్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదన్నమాట. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం అనే మాట వాళ్ల నోట నుంచి వచ్చి ఉంటే బాగుండేది.
అచ్చెన్న ఇంకా ఏమన్నారు?..
పోలింగ్ రోజున వైఎస్సార్సీపీ అరాచకాల్ని ప్రజలంతా చూశారంట. చూసినవాళ్లంతా ఆ పార్టీని కాదని టీడీపీకి ఎందుకు ఓటేయలేదో ఆయన చెప్పలేదు. రూలింగ్ పార్టీ ఇంత రూడ్ గా ప్రవర్తిస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు సైలెంటుగా ఉంటుంది?. ప్రజలు నైతికంగా తెలుగుదేశాన్నే గెలిపించారట. వైఎస్సార్సీపీ మదాన్ని అణచారట. ఇలా మనసులో అనుకొని సంతోషపడకుండా మీడియా ముందుకొచ్చి చెప్పటం దేనికో?. దాన్ని మీడియా ప్రముఖంగా పబ్లిష్ చేయటం ఎందుకో? అయినా ఆ మీడియా కూడా అదే టైపు కదా?. అంతా ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లోసే అని విమర్శకులు అంటున్నారు. జగన్ పార్టీ నేతల ముఖాల్లో సంతోషం కరువైందంట. ఇది కూడా అచ్చెన్నాయుడి ప్రవచనమే. ఎవరి ఫేసుల్లో ఆనందం ఆవిరైందో ఆయన ప్రత్యేకంగా చెప్పాల్నా?. చూస్తుంటే తెలియట్లేదా? అని విశ్లేషకులు అడుగుతున్నారు.
అభినందనలు..
వైఎస్సార్సీపీ దురాగతాలను బయటపెట్టిన టీడీపీ శ్రేణుల్ని అచ్చెన్నాయుడు అభినందించారు. అంతేలే. వాళ్లకు వాళ్లే మెచ్చుకోవటం తప్ప జనం ఎలాగూ గెలిపించరనేది డిసైడ్ అయిపోయింది. నకిలీ ఓటర్ కార్డులను అడ్డుకోకుండా పోలింగ్ ఆఫీసర్లు సైతం రూలింగ్ పార్టీ చెప్పినట్లే విన్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చ బ్యాచ్ బాధ వర్ణనాతీతం. ఓటర్లను పట్టుకొని దొంగోళ్లు అని ముద్ర వేసిన ఈ ముఠాయే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా, వింతగా అనిపిస్తోందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. పచ్చ బ్యాచ్ పిచ్చి ముదిరింది అనటానికి ఇదే నిదర్శనం అని పేర్కొంటున్నాయి.