Telangana High Court : ఏబీఎన్ మహా ఛానెల్స్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్.. చర్యలకు ఆదేశాలు..!
NQ Staff - May 31, 2023 / 12:42 PM IST

Telangana High Court : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డికి నేడు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఇదే సమయంలో మరో ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఏబీఎన్, మహాన్యూస్ లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. న్యాయవ్యవస్థ పై దాడి ని ఉపేక్షించబోమని, పూర్తి వివరాలు , ఆధారాలతో తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ కి ఇవ్వాలి రిజిస్ట్రీని ఆదేశించింది హైకోర్టు.
ఎందుకంటే రీసెంట్ గా అవినాష్ రెడ్డిని మే 31 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ఏబీఎన్ ఛానెల్, మహా ఛానెల్ లో ఈ ఆదేశాలపై డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ లో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, బీజేపీ నాయకుడు విల్సన్, ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటూ మాట్లాడుకోవడం దారుణం.

Telangana High Court Ordered Take Action Against ABN And Maha Channel
ఒక హైకోర్టు జడ్జిపై ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ రెండు ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై సదరు టీవీ ఛానెల్స్ ఇంకా స్పందించలేదు. కానీ ఈ ఆదేశాలతో ఎల్లో మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు అయింది.