Ex Minister : వైసీపీ అధినేతను తిట్టిపోస్తోన్న ’కమ్మ‘టి బూతుల మాజీ మంత్రి.!
NQ Staff - September 23, 2022 / 04:16 PM IST

Ex Minister : డాక్టర్ ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారింది వైఎస్ జగన్ సర్కారు. ఈ పేర్ల పైత్యమేంటి.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నాసరే, చెట్టుకీ.. పుట్టకీ వైసీపీ రంగులేసినట్టే, అన్నిటికీ వైస్సార్ పేర్లు పెట్టేసుకుని ‘ఆత్మ’ సంతృప్తి చెందుతోంది వైసీపీ అధినాయకత్వం. ఇక, అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ‘కమ్మ’గా వుందని భావించే ఓ మాజీ మంత్రి మాత్రం, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయమై గుస్సా అవుతున్నారట.

Telangana Ex Minister Fires on YSRCP
పైగా, ఆయన బూతుల మంత్రి. ఎన్టీయార్ అంటే తనకు అపారమైన గౌరవం వుందని పదే పదే చెబుతుంటారు. పిచ్చి చేష్టలతో తలెత్తుకు తిరగలేకపోతున్నాం.. అధినాయకత్వం పిచ్చి చేష్టలు చేస్తోంటే, అన్నిటినీ సమర్థించలేక ఛస్తున్నాం. ‘ఎన్టీయార్ పేరు మార్పు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఈ నిర్ణయంతో కమ్మ సామాజిక వర్గంలో పూర్తిగా నమ్మకం కోల్పోయాం. తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నాం..’ అని సన్నిహితుల వద్ద వాపోతున్నారట ఆ బూతుల మాజీ మంత్రి.
అసెంబ్లీకి హాజరై, ఎన్టీయార్ పేరు మార్పుని సమర్థించాల్సిన బాధ్యత వున్నా, ‘అంతకన్నా దుర్మార్గం ఇంకోటుండదు..’ అని అధినాయకత్వం నుంచి వచ్చిన పిలుపుపై భావించి.. పక్కకు తప్పుకున్నారట. ఇప్పుడీ మాజీ బూతుల మంత్రి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశమైంది.
ఆ బూతుల మంత్రిగారి స్నేహితుడు కూడా వైసీపీలోనే వున్నా, ఆ ఎమ్మెల్యే మాత్రం వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా తప్పు పట్టారు. ఎన్టీయార్ పట్ల తన నిబద్ధతని చాటుకున్నారు.