లోకేష్ మూలంగా అష్ట కష్టాలు పడుతున్న పెద్దాయన కుటుంబం

Admin - October 25, 2020 / 04:23 PM IST

లోకేష్ మూలంగా అష్ట కష్టాలు పడుతున్న పెద్దాయన కుటుంబం

తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి అండగా ఉన్న కుటుంబాల్లో కింజరాపు కుటుంబం కూడ ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టిన నాయకుడు ఎర్రన్నాయుడు. జిల్లా రాజకీయాలను ఒక్క మాటతో శాసించేవారు. తాను ఉన్నన్ని రోజుల్లో పార్టీకి ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడుకు వారి ఫ్యామిలీ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. కాబట్టే ఆయన తమ్ముడు అచ్చెన్నాయుడుకు, కుమారుడు రామ్మోహన్ నాయుడుకు టికెట్లు ఇచ్చారు. వారు కూడ బాబు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చారు.

kinjarapu yerran naidu

kinjarapu yerran naidu

ఇంతవరకు బాగానే ఉన్నా ఈమధ్య కింజరాపు కుటుంబానికి, పార్టీకి దూరం పెరిగిన వాతావరణం కనిపిస్తోంది. ఈఎస్ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన దగ్గర్నుండి వ్యవహారం చెడింది. అచ్చెన్న, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానీ ముగ్గురూ బాబుగారి వైఖరితో నొచ్చుకున్నారు. ఒకానొక దశలో పార్టీ మారే ఆలోచన చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. అలాంటి నేపథ్యంలో వారిని ఆపడానికి పార్టీ అధ్యక్ష పదవిని వాడుకోవాలనుకున్నారు చంద్రబాబు. అయితే అందుకు ఆయన కుమారుడు లోకేష్ అడ్డుపడ్డారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. అధ్యక్ష పదవి వారి కుటుంబానికి ఇస్తే తన పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని లోకేష్ భయమట.

Lokesh

Lokesh

దీంతో కొన్నిరోజులు మీమాంసలో పడిన చంద్రబాబు పదవి అచ్చెన్నాయుడుకు ఇచ్చినా పవర్ మాత్రం లోకేష్ చేతుల్లోనే అనేలా ఏర్పాట్లు చేశారట. అంటే కొత్త అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుకు మాత్రమే అధ్యక్షడున్నమాట. మిగతా వ్యవహారాలన్నీ లోకేష్ చేతుల మీదుగానే నడుస్తున్నాయి. ఈమధ్య వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనలు అంటూ హడావుడి చేస్తున్న లోకేష్ ఎక్కడా అచ్చెన్నాయుడును ఇన్వాల్వ్ కానివ్వట్లేదట. ఎక్కడ ఎవరు ఏం చేసినా అంతా ఆయన కనుసన్నల్లోనే జరగాలన్నట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో పదవి దక్కినా పవర్ దక్కలేదని కింజరాపు కుటుంబం మధనపడుతోందట.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us