NTR Health University : పవిత్రమైన హెల్త్ యూనివర్సిటీ కి ఒక రౌడీ పేరు పెడతారా ?

NQ Staff - September 22, 2022 / 05:58 PM IST

160116NTR Health University : పవిత్రమైన హెల్త్ యూనివర్సిటీ కి ఒక రౌడీ పేరు పెడతారా ?

NTR Health University  : వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దేశంలోనే మొదటి హెల్త్ యూనివర్సిటీ అయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సిగ్గు చేటు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

దేశంలో ఎక్కడ లేని సమయంలో

TDP Party Strongly Opposes Naming NTR Health University YS Rajasekhar Reddy

TDP Party Strongly Opposes Naming NTR Health University YS Rajasekhar Reddy

హెల్త్ యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ దానిని స్థాపించారని, అందుకే ఆయన పేరును పెట్టామని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. వైయస్సార్ పేరు పై ఏదైనా మీరు నిర్మించి జనాల కు అందుబాటులోకి తీసుకు రావాలి తప్పితే.. ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీని వైయస్సార్ పేరుతో తీసుకు రావడం ఏంటి అంటూ తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు.

టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఈ విషయమై స్పందిస్తూ.. పవిత్రమైన హెల్త్ యూనివర్సిటీకి ఒక రౌడీ పేరు పెడతారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు (1986) జరిగిన సమయంలో వైయస్సార్ ఎక్కడ ఉన్నాడు.. అసలు హెల్త్ యూనివర్సిటీకి అతడికి ఏమైనా సంబంధం ఉందా అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజలు ఎంతో గౌరవించే వ్యక్తిని రౌడీ అంటారా అంటూ వైకాపా నాయకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ తెలుగు ప్రజల ఆసక్తిగా చూస్తున్నారు.