Jr NTR: ఎన్టీయార్ స్థాయి తగ్గదు, వైఎస్సార్ స్థాయి పెరగదు: జూనియర్ ఎన్టీయార్ పంచ్.!
NQ Staff - September 22, 2022 / 03:39 PM IST

Jr NTR: ‘ఒకరి పేరు తీసి తన పేరు పెట్టడం వైఎస్సార్ స్థాయిని పెంచదు. అదే సమయంలో ఎన్టీయార్ స్థాయిని తగ్గించదు..’ అంటూ సినీ నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్, సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన ట్వీటేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పెను రాజకీయ దుమారం రేగుతోంది. కొత్తవి కట్టడం చేతకాక, పాతవాటి పేర్లు మార్చుతున్నారన్న విమర్శలు వైసీపీ సర్కారు మీద వస్తున్నాయి.

TDP Not Like what Jr NTR Mentioned in His Tweet
రాజకీయాలకు దూరంగా వుండే యంగ్ టైగర్…
యంగ్ టైగర్ ఎన్టీయార్ రాజకీయాలకు దూరంగా వున్నా, ఆయన టీడీపీ మనిషే. ఒకప్పుడు టీడీపీ తరఫున ఆయన ప్రచారం చేశారు. టీడీపీ బాధ్యతల్ని భవిష్యత్తులో మోయాల్సింది కూడా ఆయనే.

TDP Not Like what Jr NTR Mentioned in His Tweet
ఆ సంగతి పక్కన పెడితే, ‘ఎన్టీయార్, వైఎస్సార్.. ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు..’ అంటూ ఎన్టీయార్ తన ట్వీటులో పేర్కొనడం టీడీపీ శ్రేణులకు నచ్చడంలేదు. ‘విశ్వ విద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీయార్ సంపాదించుకున్న, కీర్తిని తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో వున్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.. అంటూ పవర్ ఫుల్ ట్వీటేశారు జూనియర్ ఎన్టీయార్. ఈ ట్వీట్ మళ్ళీ పెను రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
— Jr NTR (@tarak9999) September 22, 2022