Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర: వైఎస్ జగన్ రికార్డుని బద్దలుగొడతారా.?
NQ Staff - November 25, 2022 / 09:40 PM IST

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ 2023 జనవరి 27 నుంచి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నాలుగు వందల రోజులపాటు ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట.
పాదయాత్ర అనగానే తెలుగునాట మొట్టమొదటగా గుర్తుకొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. పాదయాత్ర ద్వారానే ఆయన ఉమ్మడి ఆ:ధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు.
చంద్రబాబు, వైఎస్ జగన్, షర్మిల కూడా..
చంద్రబాబు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వృద్ధాప్య సమస్యలు వెంటాడినాగానీ, చంద్రబాబు యాత్ర జరిగింది. ఆ ఫలితంగానే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ఆయన తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ఆయన తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, దాదాపు పదేళ్ళు ప్రతిపక్ష నేతగా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇక, వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర, వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రల గురించి అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ కూడా పాదయాత్ర సాయంతోనే అధికార పీఠమెక్కారు. షర్మిల మాత్రం, ఏపీ నుంచి తెలంగాణకు ‘వెళ్ళిపోవాల్సి’ వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి. తెలంగాణలో ఆమె ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు.
ఇంతకీ, 4 వేల కిలోమీటర్ల పాదయాత్రతో వైఎస్ జగన్ రికార్డుని లోకేష్ బద్దలుగొడతారా.? అధికార పీఠమెక్కగలుగుతారా.? వేచి చూడాల్సిందే.