Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర : వైసీపీకి అగ్ని పరీక్షే.!

NQ Staff - November 26, 2022 / 06:05 AM IST

Nara Lokesh : నారా లోకేష్ పాదయాత్ర : వైసీపీకి అగ్ని పరీక్షే.!

Nara Lokesh : మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రపై రాజకీయ ప్రకంపనలు అప్పుడే ప్రారంభమైపోయాయ్. ‘నారా లోకేష్ చేసే పాదయాత్ర వల్ల టీడీపీకి నష్టం తప్ప లాభం ఏమీ వుండదు. పాదయాత్రకు జనం రారు..’ అంటూ అధికార వైసీపీ నుంచి అప్పుడే వెటకారాలు షురూ అయ్యాయి.

కొందరు నారా లోకేష్‌ని ‘పిల్ల పిత్రేగాడు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పాదయాత్రలో నారా లోకేష్ చేసేదేం లేదు.. పది కిలోమీటర్లు నడిచేసరికే కూలబడిపోతాడన్నది వైసీపీ నేతల విమర్శల సారాంశం.

పాదయాత్ర.. వైసీపీకి తలనొప్పే..

నారా లోకేష్ పాదయాత్ర ముమ్మాటికీ వైసీపీకి తలనొప్పే. ఎందుకంటే, నారా లోకేష్ పాదయాత్రకు భద్రత కల్పించాల్సింది వైసీపీ ప్రభుత్వమే. పాదయాత్రకు ఏ కోణంలో అయినా వైసీపీ సర్కారు ఆంక్షలు పెడితే, వైసీపీకి అవి రాజకీయంగా మైనస్ పాయింట్స్ అయి తీరతాయ్.

ఎందుకంటే చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు.. అదీ ఎలాంటి ఆటంకాలూ లేకుండా. కానీ, ఇప్పుడు రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయాయి.

‘వైసీపీ మా పాదయాత్రకు ఆటంకాలు కల్పించడమే మాక్కావాల్సింది.. అప్పుడు వైసీపీ సంగతేంటో ప్రజలే చూసుకుంటారు..’ అని టీడీపీ నేతలు అంటున్నారు.
సో, టీడీపీ పక్కా ప్లానింగ్‌తోనే నారా లోకేష్ పాదయాత్రని డిజైన్ చేసిందన్నమాట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us