Nimmagadda: టీడీపీ చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పు.. ఇదెక్కడి అన్యాయం.. నిమ్మగడ్డ పై ఫైర్!

Nimmagadda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ పార్టీకి మద్దతు పలుకుతూ వైసీపీ కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నేతలు ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో నిమ్మగడ్డ టీడీపీ పార్టీకి ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను కలిసిన వైసీపీ అధికారులు టీడీపీ నేతలపై ఫిర్యాదులు చేశారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో పై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నిఘా యాప్ ని ఎన్నికల కమిషనర్ వినియోగించకుండా పక్కన పెట్టడం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరొక ఫిర్యాదు చేశారు.

tdp leaders fired on ec nimmagadda నిమ్మగడ్డ
tdp leaders fired on ec nimmagadda

వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు అంశాలపై మెమోరండం ఇచ్చామని స్పష్టం చేశారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంగించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు పై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తప్పుడు విధానాలు కొనసాగుతున్నాయని.. దయచేసి పద్ధతులు మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎలక్షన్లలో అక్రమాలకు నివారించేందుకు గాను నిఘా యాప్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిందని కానీ నిఘా యాప్ కాదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సొంతంగా మరో యాప్ ని తయారు చేస్తున్నారని అప్పి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే భారత దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం సీ విజన్ అప్లికేషన్ ని వినియోగిస్తోంది అని.. నిఘా యాప్ కాకపోయినా సీ విజన్ అప్లికేషన్ నైనా ఆంధ్రరాష్ట్రంలో అందుబాటులోకి తేవాలని తమ ఫిర్యాదులో కోరినట్టు ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement