YSRCP: దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..

YSRCP: ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం వార్తలలో మహిళపై జరుగుతున్న దారుణ సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. దిశ యాప్ లు వచ్చిన కూడా అవి ఆగడం లేదు. వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం తో ప్రజలు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికైనా కష్టం వస్తే.. స్థానిక ప్రజా ప్రతినిధులకే తమ కష్టాలు చెప్పుకుంటారు ప్రజలు. ప్రజాప్రతినిథే దాడి చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.

TDP Leaders Allegations on YSRCP Party Leaders
TDP Leaders Allegations on YSRCP Party Leaders

సీలేరులో దివ్యాంగురాలిపై స్థానిక వైసీపీ అత్యాచారానికి పాల్పడ్డారు. నేరుగా బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఫిర్యాదు చేసింది.. ఆ ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేసింది.తనని వేధించవద్దని చెప్పినా కూడా వాడు దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు పేర్కొంది.

నిందితుడు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించినట్టు దివ్యాంగురాలి బాధితులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో వైసీపీ నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

నిందితుడు వెంకట్రావు ప్రస్తుతం వైసీపీ సీలేరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు .నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న నారా లోకేష్ .. వైఎస్ఆర్ సీపీ రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకుని పోలీసులు ప్రెస్మీట్లు పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే… తామేమీ తక్కువ తినలేదంటూ స్థానిక నేతలు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇటీవల ఏపీలో వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్ ల రాసలీలల ఆడియోలు కలకలం రేపాయి.. దీనిపై ఇప్పటికీ దుమారం రేగుతూనే ఉంది.