Pattabhi Ram: టీడీపీ నేత ప‌ట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరు

Pattabhi Ram: ఏపీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టాభిరామ్‌ ను విజయవాడలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, గురువారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న న్యాయమూర్తి మూర్తి పట్టాభిరామ్‌ కు నవంబర్‌ 2 వరకు రిమాండ్‌ విధించింది.

TDP Leader Pattabhi Ram gets Bail
TDP Leader Pattabhi Ram gets Bail

పట్టాభిరామ్‌ మాట్లాడింది దారుణమైన భాష అన్నారు డీజీపీ . పట్టాభిరామ్‌ వ్యాఖ్యలు చేసిన తరువాత నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయన్నారు. చట్టబద్దమైన పదవుల్లో ఉన్న వారిని తిట్టకూడదన్నారు. పట్టాభిరామ్‌ నోరు జారి మాట్లాడిన మాటలు కాదని, ఒక పార్టీ ఆఫీసు నుంచి మాట్లాడించారన్నారు. ఒక ముఖ్యమంత్రిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.

పట్టాభిరామ్‌ ను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు త‌ర‌లించ‌గా, పట్టాభిరామ్‌ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు నిరసనగా జనాగ్రహ దీక్షకు దిగారు. అయితే ఈ రోజు ప‌ట్టాభికి బెయిల్ మంజూరు చేశారు.

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఇంటిపై దాడి వ్యవహారంలో 11 మందిపై కేసు నమోదైంది. నిందితులను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు.

బావాజీపేటకు చెందిన బచ్చు మాధవి, ఉడ్‌పేటకు చెందిన ఇందుపల్లి సుభాషిణి, గుణదలకు చెందిన తంగం ఝాన్సీరాణీ, సునీతతోపాటు సీతారాంపురానికి చెందిన గూడవల్లి భారతిపై కేసు నమోదైంది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.