T20 World Cup: భార‌త్- పాక్ టీ 20 మ్యాచ్‌లో సంద‌డి చేసిన టీడీపీ నేత‌

T20 World Cup ఒకే ఒక్క మ్యాచ్ కోసం దాదాపు ప‌ది కోట్ల మంది ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు.ఆ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ‌గా సాగుతుంద‌ని అంద‌రు భావించారు. కాని మ్యాచ్ మొత్తం వ‌న్ సైడ్‌గా మారింది. తొలి మ్యాచ్‌లోనే భార‌త్ ఘోర ప‌రాజ‌యం చెంద‌డంతో అభిమానులు చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు.

టీ-20 వరల్డ్ కప్‌లో పాక్-టీమిండియా మధ్య దుబాయ్ వేదికగా జ‌రిగిన మ్యాచ్‌కి పలువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. సినీ ప్ర‌ముఖులు,రాజ‌కీయ నాయ‌కులు సంద‌డి చేశారు. మ్యాచ్‌లో అనంతపురం పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ జేసీ పవన్ రెడ్డి సందడి చేశారు. జాతీయ జెండా పట్టుకుని కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ రెడ్డి కూడా పాక్-టీమిండియా మ్యాచ్‌లో ఇలా సందడి చేశారు. ఇక అక్ష‌య్ కుమార్, ప్రీతి జింతా వంటి సినిమా స్టార్స్ కూడా టీ 20 మ్యాచ్‌లో సంద‌డి చేస్తూ క‌నిపించారు. కాగా, దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓడింది. మ్యాచ్‌లో తొలుత విరాట్ కోహ్లీ (57: 49 బంతుల్లో 5×4, 1×6) హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేయగలిగింది.

చేజింగ్‌లో దూకుడుగా ఆడేసిన పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్ (68 నాటౌట్: 52 బంతుల్లో 6×4, 2×6), మహ్మద్ రిజ్వాన్ (79 నాటౌట్: 55 బంతుల్లో 6×4, 3×6).. అలవోకగా ఆ జట్టుని గెలిపించారు. 17.5 ఓవర్లు వేసిన భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో పాకిస్తాన్.. భార‌త్‌పై గెల‌వ‌డం ఇదే తొలిసారి అని అంటున్నారు.