Jr NTR : టీడీపీ తారక్‌ ని టార్గెట్‌ చేస్తుందా? యంగ్ టైగర్ ని దూరం పెట్టడం పార్టీకి లాభమా? నష్టమా?

NQ Staff - September 26, 2022 / 04:45 PM IST

Jr NTR : టీడీపీ తారక్‌ ని టార్గెట్‌ చేస్తుందా? యంగ్ టైగర్ ని దూరం పెట్టడం పార్టీకి లాభమా? నష్టమా?

Jr NTR : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ప్రణాళికలు వేస్తోంది టీడీపీ. మరోవైపు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలనా విధానాలు ఎంత కాదనుకున్నా చాలానే టీడీపీకి కలిసొచ్చే అంశాలే. వాటిని సరిగ్గా మలచుకుంటే ఆ వ్యతిరేకతని ఇటు ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సరిగ్గా ఇక్కడే టీడీపీలో కొత్త జోష్ రావడానికి,

పార్టీ మరింత బలోపేతమవ్వడానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంట్రీ పక్కా కావాల్సిందేనన్న టాక్‌ మరోసారి హాట్ టాపికయింది. సినిమాలతోనూ, ప్యాన్ ఇండియా ప్రాజెక్టులతోనూ ఎంత బిజీగా ఉన్నా, పొలిటికల్ సర్కిల్స్‌ లోనూ తారక్ రాక గురించి, వస్తే జరిగే పరిణామాల గురించి చాన్నాళ్లుగానే చర్చ నడుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతాడంటూ వార్తలు వినిపించడం కూడా కొత్తేమీ కాదు. మరోవైపు తారక్ ని టార్గెట్ చేస్తూ, ఆయన వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదంటూ టీడీపీలో నుంచే కామెంట్స్‌, కౌంటర్స్‌ రీసెంట్ గా ఎక్కువవడంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రీసెంట్ గా ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెట్టిన తారక్ పెట్టిన ట్వీట్ పై టీడీపీ నుంచే విమర్శలు వినిపించాయి. అంత సీరియస్‌ ఇష్యూపై కూడా మరీ బ్యాలెన్స్‌డ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ మాత్రం కూడా డైరెక్ట్‌ గా విమర్శించలేడా? అంటూ ఫైరయ్యారు సైకిల్ పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ కొందరు. ఇది చాలనట్టు మరోవైపు కొడాలి నాని ఇష్యూ ఉండనే ఉంది.

ఆయనకు దగ్గరుండి బాబుగారి చేత టికెట్ ఇప్పించింది తారకే. ఇప్పుడు అదే నాని పార్టీ మారి వైసీపీలో చేరి బాబును, టీడీపీని బండబూతులు తిడుతుండే పడాల్సిన పరిస్థితొచ్చింది. నాని వ్యక్తిత్వం తెలిసీ తారక్‌ సపోర్ట్ చేశాడంటూ ఓపెన్ గానే ఫైరవుతున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు.

ఈ విమర్శలు, పార్టీలో గుసగుసలు పక్కనబెడితే తారక్ కూడా ఖాకీ చొక్కా వేసి, షూటింగులు ఆపేసి, అప్పట్లో జనాల్లోకి వెళ్లి మరీ ప్రచారం చేసి పార్టీని పవర్లోకి తెచ్చేందుకు తనవంతుగా కష్టపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్‌. కానీ ఆ తర్వాత టీడీపీ నుంచి ఆశించినంత గౌరవం దక్కలేదనీ తారక్‌ ని వాడుకుని వదిలేశారన్న ప్రచారం కూడా సాగింది. ఈ అంశం ఎన్టీఆర్‌ అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది.

ఇక అదే పార్టీలో కొన్నాళ్లుగా బాబు, లోకేష్ తీరు నచ్చని లీడర్లు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వాళ్లవల్ల పార్టీ ముందుకెళ్లడం కష్టమే అని నమ్మే కార్యకర్తలు కూడా ఉన్నారు. దాంతో వాళ్లంతా జూనియర్ ఎన్టీఆర్‌ వస్తేనే పార్టీకి పూర్వవైభవం వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఎంత కాదనుకున్నా ప్రస్తుతమున్న పరిస్థితిలో అధికారంలో ఉన్న వైసీపీకి గట్టి పోటీనివ్వాలంటే పార్టీకిప్పుడు కొత్త జోష్, సరయిన నాయకత్వం కావాల్సిందే. గ్లామర్ కూడా కలిసొస్తే సైకిల్ జోరు పెరగడం కొంత ఖాయం.

సో.. సరిగ్గా వాడుకుంటే తారక్ క్రేజ్‌, ఫాలోయింగ్ టీడీపీకి కచ్చితంగా కలిసొస్తుందనేది పార్టీలోనే వినిపిస్తున్న బలమైన వాదన.
ఎన్టీఆర్‌ ని దూరం చేసుకోవడం వల్ల పార్టీకి కలిగే లాభాలు, నష్టాల్ని బేరీజు వేసుకుని ఈ విషయంపై సీరియస్ గా టీడీపీ అధిష్టానం ఆలోచించాల్సిన అవసరమయితే ఉంది. తారక్‌ ని టార్గెట్ చేయడం వల్ల సొంత పార్టీలో నుంచే వస్తున్న వ్యతిరేకతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే. మరోవైపు యాంటీ ఎన్టీఆర్ వర్గాల అభిప్రాయాలు కూడా తీసుకుని అందరినీ కలుపుకుపోయేలా పనిచేసి,
పవర్లోకి రావాలన్న లక్ష్యంపై ఫుల్‌ ఫోకస్ చేయాల్సిన పరిస్థితయితే వచ్చేసింది.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us