ఏంటండీ బాబుగారు ఇది.. పాపం వారికి న్యాయం చెయ్యరా మీరు ? 

tdp chief chandrababu not doing justice for prathibha bharathi
tdp chief chandrababu not doing justice for prathibha bharathi
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్‌ నాయకుల విషయంలో అశ్రద్ద చూపిస్తున్నారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించిన వారికి కూడా ఇప్పుడు ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఆ కారణం వల్ల పలువురు ముఖ్యులు పార్టీని వదిలి వెళ్లారు. అదే మళ్లీ మళ్లీ బాబు చేస్తున్నారు. ఆయన చేస్తున్న తప్పు తో మరో సీనియర్‌ నేత పార్టీ నుండి వెళ్తారా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో స్పీకర్‌ గా పనిచేసిన ప్రతిభాభారతి విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు ఆమె మద్దతుదారులకు మరియు పార్టీ నాయకులకు కూడా మింగుడు పడటం లేదు అంటున్నారు.
tdp chief chandrababu not doing justice for prathibha bharathi
tdp chief chandrababu not doing justice for prathibha bharathi
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఆమెను తీసుకు వెళ్లి ఏమాత్రం ప్రాముఖ్యత లేని జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఆ పదవితో ఆమె కు ఏం లాభం లేదు. సరే తనకు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు కనీసం తన కూతురుకు అయినా న్యాయం చేయండి అంటూ బాబును కలిసిన పలు సార్లు ఆమె బాబును రిక్వెస్ట్‌ చేశారట. చాలా కాలంగా ప్రతిభా కుమార్తె గ్రీష్మ టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ శ్రీకాకుళం జిల్లా పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్న విషయం తెల్సిందే. ఆమెకు పార్టీ పదవి లేకున్నా కూడా చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారికి పార్టీలో కీలక పదవి ఇవ్వాలని కార్యకర్తలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని బాబు మాత్రం ఆమెకు ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతిభా భారతి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాం నుండి పోటీ చేసి గట్టి పోటీని ఇచ్చారు. కాని రాజకీయ సమీకరణాలు సరిగా లేని కారణంగా ఆ సమయంలో ఆమె ఓడిపోయారు. తదుపరి ఎన్నికల్లో ఆమెకు ఛాన్స్‌ ఇస్తే తప్పకుండా గెలిచేవారు అని నియోజక వర్గ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని 2019 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసే బాధ్యతను కొండ్రు మురళికి ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోయారు. ఓడిపోయినప్పటి నుండి పార్టీలో క్రియాశీలకంగా లేడు. ఆయన సొంత పనులు చక్కబెట్టుకుంటూ నియోజక వర్గంలో కనిపించడం లేదు. ఈ సమయంలో ప్రతిభా భారతి మళ్లీ రాజాం లో క్రియాశీలకం అయ్యారు. అయినా కూడా ఆ నియోజక వర్గ బాధ్యతలను ఆమెకు కాని గ్రీష్మకు కాని ఇచ్చేందుకు బాబు ఆసక్తి చూపించలేదు. పార్టీ కోసం పని చేసే అలాంటి వారికి బాబు గారు న్యాయం చేయాలి అంటూ స్థానిక టీడీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here