తిరుపతి ఉప ఎన్నికలో మారిపోయిన టీడీపీ అభ్యర్ధి ?? 

ఏపీలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలు అవ్వబోతుంది. తిరుపతి పార్లమెంట్‌ స్థానంకు ఉప ఎన్నిక జరుగబోతున్న విషయం తెలిసిందే. ఆ స్థానంను గెలుచుకునేందుకు వైకాపా ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కాని తెలుగు దేశం పార్టీ మాత్రం మల్లగుల్లాలు పడుతున్నట్లుగా అనిపిస్తుంది. చంద్రబాబు సొంత జిల్లా అవ్వడం వల్ల అక్కడ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో తెలుగు దేశం పార్టీ ఇప్పటి నుండే చాలా జాగ్రత్తగా అక్కడ పావులు కదపాల్సి ఉంది. కాని పరిస్థితులు చూస్తుంటే మాత్రం చేతులు ఎత్తేసే అవకాశం ఉందనిపిస్తుంది. బీజేపీ కి అక్కడ మద్దతు ఇచ్చి తెలుగు దేశం పార్టీ సైడ్‌ అయ్యే యోచనలో ఉందేమో అనే అనుమానాలను వైకాపా నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
tdp candidate may be change in tirupati by elections
tdp candidate may be change in tirupati by elections
తెలుగు దేశం పార్టీ నుండి ఇప్పటికే పనబాక లక్ష్మిని రంగంలోకి దించుతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఆమె కాస్త బలమైన క్యాండిడేట్‌ అనడంలో సందేహం లేదు. చిత్తూరులో ఆమెకు మంచి పలుకుబడి ఉన్న కారణంగా గెలుపు గుర్రం ఎక్కినా ఎక్కే అవకాశం ఉందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆమె స్థానంలో మరొకరికి ఛాన్స్‌ ఇచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. బీజేపీకి మద్దతు ఇచ్చే ఉద్దేశ్యంతో ఆమెను తప్పించి మరొకరికి ఇస్తారా అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు దేశం పార్టీకి చెందిన ఒక నేతకు చిత్తూరు టికెట్‌ ను ఆఫర్‌ చేశారట. ఆయన కూడా సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్దగా కష్టం లేకుండా ఓడిపోయేందుకు కూడా సిద్దంగా ఉంటాడని ఆయన్ను ఎంపిక చేశారేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు దేశం పార్టీ నుండి వైకాపాకు గట్టి పోటీ అయితే ఉంటుంది. కాని బీజేపీ కూడా జాయిన్‌ అయితే ఈ పోటీ రసవత్తరంగా మారుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా తెలుగు దేశం పార్టీ కూడా గట్టిగా పోటీ ఇస్తే ఇక్కడ వైకాపాకు లాభం చేకూరుతుంది. అందుకే జనసేన బీజేపీ ల అభ్యర్థికి అనధికారికంగా తెలుగు దేశం పార్టీ మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాన్ని బట్టి వచ్చే అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నిక కు పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement