Syed Mia : వింత.. అంత్యక్రియలు జరిగిన 41 రోజుల తర్వాత తిరిగి ప్రత్యక్షం
NQ Staff - July 29, 2022 / 01:09 PM IST

Syed Mia : మరణాల విషయంలో ఊహించని సంఘటనలు ఎదురవుతున్నాయి. మరణించారని అనుకుంటున్న సమయంలో లేచి కూర్చోవడం, అంత్యక్రియలు చేస్తున్నప్పుడు సడెన్‌గా శవం పైకి లేవడం వంటివి మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా లో ఇలాంటి ఘటనే జరిగింది. అంత్యక్రియలు జరిగిన 41 రోజుల తర్వాత వ్యక్తి తిరిగిరావడంతో అందరి ఫ్యూజులు ఔట్ అయ్యాయి.
అలా ఎలా జరిగింది?
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన సయ్యద్ మియా అనే వ్యక్తి గతంలో ఆర్మీలో పనిచేసేవాడు. మద్యానికి బానిసవడంతో సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రహమత్ బి, ఒక కుమార్తె ఉన్నారు. తరచూ తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. సయ్యద్ మియా ఎప్పుడు పనికి వెళ్లినా రెండు మూడు నెలల తర్వాత ఇంటికొస్తుండేవాడు.

Syed Mia Family Thought was Dead
40 రోజుల క్రితం మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. అచ్చం సయ్యద్ మియాలానే కనిపించడంతో అతడే అనుకొని తమ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు. కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సయ్యద్ మియా తిరిగి వచ్చాడు.
అయితే అసలు విషయం ఏంటంటే చనిపోయింది సయ్యద్ మియా పోలికలతో ఉన్న వ్యక్తి. లారీపై డ్యూటీకి వెళ్లిన సయ్యద్ మియా ఊళ్లో పీర్ల చావిడి వేడుకలకు ఇంటికొచ్చినట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. మొత్తానికి చనిపోయినవాడు తిరిగొచ్చాడని సయ్యద్ మియా కుటుంబం పండగ చేసుకుంటోంది.